Serena Williams-Lebron James: G.O.A.T అని ఇలా కూడా పిలవొచ్చా.. వారెవ్వా!

US Open: LeBron James Goat-Sound Praise Serena Williams Enter 3rd Round - Sakshi

అమెరికన్‌ టెన్నిస్‌ స్టార్‌ సెరెనా విలియమ్స్‌ యూఎస్‌ ఓపెన్‌లో మూడో రౌండ్‌కు దూసుకెళ్లిన సంగతి తెలిసిందే. 27 ఏళ్ల కెరీర్‌లో చివరి గ్రాండ్‌స్లామ్‌ ఆడుతున్నట్లు ఇప్పటికే ప్రకటించిన సెరెనా.. అందుకు తగ్గ ఆటతీరునే ప్రదర్శిస్తోంది. బుధవారం అర్థరాత్రి తర్వాత జరిగిన రెండో రౌండ్‌ మ్యాచ్‌లో వరల్డ్‌ నెంబర్‌-2 అనెట్‌ కొంటావెయిట్‌కు షాక్‌ ఇచ్చిన సెరెనా అద్భుత ప్రదర్శనతో 24వ టైటిల్‌ దిశగా అడుగులు వేస్తుంది.

తొలి సెట్‌ టై బ్రేక్‌లో నెగ్గిన సెరెనా.. రెండో సెట్‌ను కోల్పోయి కూడా ఫుంజుకున్న తీరు అద్భుతమనే చెప్పొచ్చు. పాత సెరెనాను తలపిస్తూ విజృంభించిన ఆమె సెట్‌తో పాటు మ్యాచ్‌ను కైవసం చేసుకుంది. ఇదిలా ఉంటే క్రీడల్లో ఆల్‌టైమ్‌ గ్రేట్‌ను G.O.A.T (గ్రేటెస్ట్‌ ఆఫ్‌ ఆల్‌  టైమ్‌) అని పిలుస్తుంటారు. ఇప్పటికే G.O.A.Tగా పిలవబడుతున్న సెరెనాను ఎన్‌బీఏ(బాస్కెట్‌బాల్‌) చాంపియన్‌ లెబ్రన్‌ జేమ్స్‌ తనదైన శైలిలో సంబోధించడం వైరల్‌గా మారింది.

సెరెనా మ్యాచ్‌ను టీవీలో వీక్షించిన లెబ్రన్‌ జేమ్స్‌.. ఆమె మ్యాచ్‌ గెలిచిన అనంతరం GOAT పదం ఉచ్చరించేలా.. మేక శబ్ధం అయిన ''మే.. మే..'' అని అరిచాడు. ఒక రకంగా సెరెనా విజయాన్ని సెలబ్రేట్‌ చేసుకుంటూ G.O.A.T అనే పదాన్ని తనదైన స్టైల్లో పిలిచి ఆమె గౌరవాన్ని మరింత పెంచాడు. దీనికి సంబంధించిన వీడియో సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారింది.

చదవండి: వరల్డ్‌ నెంబర్‌-2కు షాక్‌.. మూడో రౌండ్‌కు దూసుకెళ్లిన నల్లకలువ

నాడు కోహ్లి వర్సెస్‌ సూర్య! ఇప్పుడు సూర్యకు విరాట్‌ ఫిదా! తలవంచి మరీ! వైరల్‌

Read latest Sports News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top