గంగూలీకి మరో రెండు స్టెంట్‌లు | Two stents implanted after fresh angioplasty to Sourav Ganguly | Sakshi
Sakshi News home page

గంగూలీకి మరో రెండు స్టెంట్‌లు

Jan 29 2021 4:51 AM | Updated on Jan 29 2021 9:21 AM

Two stents implanted after fresh angioplasty to Sourav Ganguly  - Sakshi

కోల్‌కతా: భారత క్రికెట్‌ నియంత్రణ మండలి (బీసీసీఐ) అధ్యక్షుడు, మాజీ కెప్టెన్‌ సౌరవ్‌ గంగూలీకి గురువారం వైద్యులు యాంజియోప్లాస్టీ చికిత్సను విజయవంతంగా నిర్వహించారు. ఛాతీలో అసౌకర్యంతో బుధవారం ఆసుపత్రిలో చేరిన ఆయనకు తాజాగా రెండు స్టెంట్‌లు అమర్చారు. ప్రస్తుతం ఆయన ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉందని వైద్యులు వెల్లడించారు. ‘కరోనరీ ఆర్టినరీ పూడికలను తొలగించేందుకు గంగూలీకి అదనంగా రెండు స్టెంట్‌లు అమర్చాం. ప్రస్తుతం ఆయనను జాగ్రత్తగా పర్యవేక్షిస్తున్నాం. ఆపరేషన్‌కు ముందు పలు వైద్య పరీక్షలు నిర్వహించాం’ అని వారు తెలిపారు. 48 ఏళ్ల గంగూలీ ఈ నెలలో రెండు సార్లు ఆసుపత్రి పాలయ్యారు. జనవరి 2న స్వల్ప గుండెపోటు రావడంతో ఆయనకు యాంజియోప్లాస్టీ ద్వారా ఒక స్టెంట్‌ను అమర్చారు. తాజాగా మరోసారి ఛాతీలో అసౌకర్యం ఏర్పడటంతో ఇంకో రెండు స్టెంట్‌లు వేశారు.  

Advertisement
 
Advertisement
Advertisement