ఐపీఎల్ లో రెండు కొత్త జట్లును ప్రకటించిన బీసీసీఐ..

Two New IPL Teams Announced Lucknow And Ahmedabad To Be Inducted - Sakshi

Two New IPL Teams Announced Lucknow And Ahmedabad: ఐపీఎల్‌-2022లో పాల్గొనే రెండు కొత్త జట్లను బీసీసీఐ సోమవారం ప్రకటించింది. ఐపీఎల్‌ కొత్త జట్లుగా అహ్మదాబాద్, లక్నో అవతరించనున్నాయి. దుబాయ్‌లో జరిగిన బిడ్డింగ్‌లో అహ్మదాబాద్, లక్నో ఐపీఎల్‌ ప్రాంఛైజీలను దక్కించుకున్నాయి. ఈ బిడ్డింగ్‌ పక్రియలో  ధర్మశాల, గువహతి, రాంచీ, లక్నో, అహ్మదాబాద్, కటక్ పోటీపడ్డాయి. సంజీవ్ గోయెంకా గ్రూప్  7090 కోట్లకు లక్నో ఫ్రాంచైజీని సొంతం చేసుకుంది. సీవీసీ క్యాపిటల్స్‌ రూ. 5,625 కోట్లకు అహ్మదాబాద్ ప్రాంఛైజీని దక్కించుకుంది. దీంతో వచ్చే ఏడాది మెత్తం 10 జట్లు ఈ క్యాష్‌ రిచ్‌ లీగ్‌లో పాల్గొననున్నాయి.

చదవండి: Ashish Nehra: రిజ్వాన్‌, బాబర్‌ చాలా బాగా బ్యాటింగ్‌ చేశారు.. అయితే..

Read latest Sports News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram 

Read also in:
Back to Top