Ashish Nehra: రిజ్వాన్‌, బాబర్‌ చాలా బాగా బ్యాటింగ్‌ చేశారు.. అయితే..

The way Pakistan has won They have forced people to stand and take notice of them says Ashish nehra - Sakshi

Ashish Nehra Comments on Pakistan 10 Wickets Win Against India: టీ20 ప్రపంచ కప్‌లో భారత్‌పై అద్భుత విజయం సాధించి యావత్‌ క్రికెట్‌ ప్రపంచం ముందు పాకిస్తాన్‌ సత్తా చాటిందని టీమిండియా మాజీ పేసర్‌ ఆశిష్ నెహ్రా అన్నాడు. "సెమీ ఫైనల్‌కు చేరుకోవడానికి ఆర్హతలేని జట్టుగా పాకిస్తాన్‌ను అందరూ తక్కువ అంచనా వేస్తున్నారు. ప్రస్తుతం వారి గ్రూప్‌లో న్యూజిలాండ్, ఇండియా వంటి బలమైన జట్లు వున్నాయి. కానీ టీ 20ల్లో ఎవరైనా ఎవరినైనా ఓడించవచ్చు. ఆదేమి పెద్ద విశేషం కాదు. అయితే పాకిస్తాన్ గెలిచిన తీరు అందరనీ ఆశ్చర్యపరుస్తుంది.

ఇక ఆటలో మంచు ప్రభావం గురించి నెహ్రా మాట్లాడుతూ, "మంచు కారణంగా బంతి కూడా కొద్దిగా తడిసిపోయింది. పిచ్ బ్యాటింగ్ చేయడానికి మెరుగ్గా ఉండటంతో, వారు దానిని పూర్తిగా సద్వినియోగం చేసుకున్నారు. ఈ మ్యాచ్‌లో పాకిస్తాన్‌ ఆడిన విధానాన్ని అందరూ ప్రశంసించవలసి ఉంటుంది.  పాకిస్తాన్ ఇన్నింగ్స్‌  ప్రారంభించిన విధానం.. వారిలో ఆత్మవిశ్వాసాన్ని నింపింది.  రిజ్వాన్‌, బాబర్‌  చాలా బాగా బ్యాటింగ్ చేశారు. ఈ మ్యాచ్‌లో వారిద్దరూ ఎటువంటి  రిస్క్‌ తీసుకోకుండా ఆడారు" అని క్రిక్‌బజ్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో నెహ్రా పేర్కొన్నాడు. 

ఇక మ్యాచ్‌ విషయానికి వస్తే.. టాస్‌ ఓడి బ్యాటింగ్‌కు భారత జట్టు నిర్ణీత 20 ఓవర్లలో 7 వికెట్లు కోల్పోయి.. 151 పరుగులు చేసింది. లక్ష్య ఛేదనకు దిగిన పాకిస్తాన్‌ ఓపెనర్లు మహ్మద్‌ రిజ్వాన్‌, బాబర్‌ ఆజం చెలరేగడంతో అలవోకగా 10 వికెట్ల తేడాతో విజయం సాధించింది. తద్వారా ప్రపంచకప్‌లో పాకిస్తాన్‌పై టీమిండియా జైత్రయాత్రకు బ్రేక్‌ పడినట్లయింది.

చదవండి: Ind Vs Pak: ‘చెత్త అంపైరింగ్‌.. అసలు రాహుల్‌ అవుట్‌ కాలేదు.. అది నో బాల్‌.. కావాలంటే చూడండి’

Read latest Sports News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top