KL Rahul No Bowl: ‘చెత్త అంపైరింగ్‌.. అసలు రాహుల్‌ అవుట్‌ కాలేదు.. అది నో బాల్‌.. కావాలంటే చూడండి’

T20 World Cup 2021 Ind Vs Pak: Twitter Not Happy After KL Rahul Dismissal Why - Sakshi

అంపైర్‌పై విరుచుకుపడుతున్న నెటిజన్లు

‘Stupid umpiring in this crucial match is not acceptable’- Netizens: టీమిండియా ఓపెనర్లు రోహిత్‌ శర్మ.. గోల్డెన్‌ డక్‌... కేఎల్‌ రాహుల్‌ 3 పరుగులకే అవుట్‌‌... వీళ్లిద్దరినీ పెవిలియన్‌కు పంపి.. ఆదిలోనే టీమిండియాను కోలుకోలేని దెబ్బ కొట్టాడు పాకిస్తాన్‌ బౌలర్‌ షాహిన్‌ ఆఫ్రిది.. ఆ తర్వాత టీమిండియా కెప్టెన్‌ విరాట్‌ కోహ్లిని సైతం అవుట్‌ చేసి.. పాక్‌ విజయంలో కీలక పాత్ర పోషించాడు. తద్వారా ప్లేయర్‌ ఆఫ్‌ ది మ్యాచ్‌గా నిలిచాడు. 

ఇంతవరకు బాగానే ఉంది.. కానీ... కేఎల్‌ రాహుల్‌ను అవుట్‌గా ప్రకటించిన విధానం అస్సలు సరికాదు అంటున్నారు నెటిజన్లు. చెత్త అంపైరింగ్‌ అంటూ విమర్శిస్తున్నారు. కాగా మూడో ఓవర్‌లో మొదటి బంతి(ఇన్‌స్వింగర్‌)తోనే రాహుల్‌ను బౌల్డ్‌ చేశాడు ఆఫ్రిది. అయితే, బంతిని విసిరే సమయంలో ఆఫ్రిది కాలు గీతను దాటినట్లు కనపడింది. ఈ విషయాన్ని గుర్తించిన నెటిజన్లు సోషల్‌ మీడియా వేదికగా ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. 

ఇందుకు సంబంధించిన ఫొటోలు, వీడియోలు షేర్‌ చేస్తూ.. నో బాల్‌కు అవుట్‌ ఎలా ఇస్తారు అంటూ తీవ్ర స్థాయిలో మండిపడుతున్నారు. ‘‘అంపైర్‌ నిద్రపోతున్నాడా.. అసలు ఐసీసీ ఏం చేస్తోంది. రూల్స్‌ పెడతారు కానీ.. పాటించరా? మ్యాచ్‌ను మలుపు తిప్పగల బ్యాటర్‌.. ఇలా అంపైర్‌ నిర్ణయానికి బలైపోవడం అస్సలు ఆమోదయోగ్యం కాదు.

చెత్త అంపైరింగ్‌. అసలు మీరు స్పృహలోనే ఉన్నారా’’ అంటూ ట్రోల్‌ చేస్తున్నారు. అనుమానాలు ఉంటే ఈ ఫొటోలు చూసుకోండి అంటూ పోస్టులు పెడుతున్నారు. రాహుల్‌ గనుక ఒకవేళ అవుట్‌ అయి ఉండకపోతే ఫలితం మరోలా ఉండేది కదా అంటూ కామెంట్లు చేస్తున్నారు. కాగా ఈ మ్యాచ్‌లో క్రిస్‌ క్రిస్‌ గఫానే(న్యూజిలాండ్‌), మారిస్‌ ఎరాస్మస్‌(సౌతాఫ్రికా) అంపైర్లుగా వ్యవహరించారు. మ్యాచ్‌ రిఫరీ- డేవిడ్‌ బూన్‌. థర్డ్‌ అంపైర్‌- రిచర్డ్‌ ఇల్లింగ్‌వర్త్‌.

స్కోర్లు: 
ఇండియా- 151/7 (20)
పాకిస్తాన్‌- 152/0 (17.5)

చదవండి: MS Dhoni: ఓటమి అనంతరం.. పాక్‌ ఆటగాళ్లతో ధోని ముచ్చట.. వీడియో వైరల్‌

మీ అభిప్రాయం చెప్పండి

Loading...

Read latest Sports News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top