ENG VS NZ: 'బజ్‌బాల్‌' ఎలా అడ్డుకోవాలి?.. ఫ్యాన్స్‌ను వేడుకున్న కివీస్‌ టాప్‌ వెబ్‌సైట్‌

Top New Zealand Website Asks Fans Solutions Tackle Eng-Bazball Cricket - Sakshi

బజ్‌బాల్‌(Bazball) క్రికెట్‌తో ఇంగ్లండ్‌ చేస్తున్న విధ్వంసం అంతా ఇంతా కాదు. ఐదురోజులు జరగాల్సిన టెస్టు మ్యాచ్‌ను ఇంగ్లండ్‌ 'బజ్‌బాల్‌' ఆటతీరుతో వీలైనంత తొందరగా ముగించాలని చూస్తోంది. బ్యాటింగ్‌కు దిగితే దాటిగా ఆడడం.. బౌలింగ్‌ వేస్తే వేగంగా వికెట్లు తీయాలనుకోవడం.. ఇలా స్టోక్స్‌ సారధ్యంలోని ఇంగ్లండ్‌ దూసుకుపోతుంది.

ఇప్పటికే పాకిస్తాన్‌ను బజ్‌బాల్‌ మంత్రంతో వారి గడ్డపై టెస్టు సిరీస్‌లో మట్టికరిపించింది. బజ్‌బాల్‌ క్రికెట్‌ను పాకిస్తాన్‌ జట్టుకు మొదటిసారిగా పరిచయం చేసింది. తాజాగా న్యూజిలాండ్‌తో టెస్టు సిరీస్‌లోనే అదే దూకుడు మంత్రాన్ని కొనసాగిస్తుంది. కివీస్‌తో జరిగిన తొలి టెస్టులో స్టోక్స్‌ సేన 267 పరుగుల భారీ తేడాతో విజయం సాధించి రెండు టెస్టుల సిరీస్‌లో 1-0తో ఆధిక్యంలోకి వెళ్లింది.

దీంతో ఇంగ్లండ్‌ బజ్‌బాల్‌ ఆటతీరును ఎలా అడ్డుకోవాలో కాస్త చెప్పండి అంటూ న్యూజిలాండ్‌కు చెందిన టాప్‌ వెబ్‌సైట్‌ స్టఫ్‌.కో. ఎన్‌జెడ్‌(Stuff.co.nz) క్రికెట్‌ అభిమానులను కోరడం ఆసక్తి కలిగించింది. ''ఇంగ్లండ్‌ బజ్‌బాల్‌ ఆటతో దూకుడు మంత్రం జపిస్తుంది. వెల్లింగ్టన్‌ వేదికగా మొదలుకానున్న రెండో టెస్టులో ఇంగ్లండ్‌ బజ్‌బాల్‌ క్రికెట్‌కు ముకుతాడు వేయడానికి 400-800 పదాలతో ఒక పరిష్కార మార్గాన్ని లేదా గేమ్‌ ‍స్ట్రాటజీని రాసి పంపించగలరు. మీ విలువైన సమాచారాన్ని ఈ-మెయిల్‌ ద్వారా అందించగలరు'' అంటూ మెయిల్‌ ఐడీ ఇచ్చింది. ఒకవేళ మీకు కూడా ఆసక్తి ఉంటే stuffnation@stuff.co.nzకు బజ్‌బాల్‌ క్రికెట్‌ను అడ్డుకునే సలహాను పంపించండి.

ఇక తొలి టెస్టులో తొలుత బ్యాటింగ్‌ చేసిన ఇంగ్లండ్‌ తొలిరోజునే 325 పరుగుల వద్ద ఇన్నింగ్స్‌ను డిక్లేర్‌ చేసి అందరిని ఆశ్చర్యపరిచింది. ఆ తర్వాత న్యూజిలాండ్‌ తడబడినా 306 పరుగులకు ఆలౌటైంది. ఆ తర్వాత రెండో ఇన్నింగ్స్‌లో వేగంగా ఆడిన ఇంగ్లండ్‌ కివీస్‌ ముందు 374 పరుగుల లక్ష్యాన్ని ఉంచింది. ఇంగ్లండ్‌ బ్యాటర్లలో నలుగురు హాఫ్‌ సెంచరీలు చేయగా.. ఓలీ పోప్‌ 49 పరుగుల వద్ద ఔటయ్యాడు. ఆ తర్వాత పేస్‌ ద్వయం అండర్సన్‌, స్టువర్ట్‌ బ్రాడ్‌లు చెరో నాలుగు వికెట్లు తీసి ఇంగ్లండ్‌కు భారీ విజయాన్ని కట్టబెట్టారు.

చదవండి: Joe Root: 'రూట్‌' దారి తప్పింది.. 'నా రోల్‌ ఏంటో తెలుసుకోవాలి'

10 వికెట్ల తేడాతో విజయం.. దర్జాగా సెమీస్‌కు

Read latest Sports News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top