Tokyo Olympics 2020 : Twitter Consoles PV Sindhu After Semi Final Loss Game - Sakshi
Sakshi News home page

PV Sindhu: ఓటమిపై స్పందించిన పీవీ సింధు

Jul 31 2021 6:43 PM | Updated on Aug 1 2021 11:14 AM

Tokyo Olympics 2020: PV Sindhu Words After Semi Final Loss - Sakshi

PV Sindhu On Tokyo Olympics 2020 Semi Final Loss: ‘‘సెమీ ఫైనల్‌లో ఓడినందుకు బాధగానే ఉంది. చివరికంటా నా శక్తిమేరకు పోరాడాను. కానీ ఈరోజు నాది కాకుండా పోయింది’’ అని భారత షట్లర్‌ పీవీ సింధు పేర్కొంది. టోక్యో ఒలింపిక్స్‌ సెమీస్‌లో చైనీస్‌ తైపీ క్రీడాకారిణి తైజుయింగ్‌ చేతిలో ఓటమి గురించి స్పందిస్తూ విచారం వ్యక్తం చేసింది. బ్యాడ్మింటన్‌ వరల్డ్‌ ఫెడరేషన్‌ వర్గాలతో సింధు మాట్లాడుతూ... ‘‘తన బలబలాను అంచనా వేసే బరిలోకి దిగాను. కానీ తను నాపై పైచేయి సాధించింది. సెమీస్‌లో పాయింట్లు సాధించడం అంత తేలికేమీ కాదు. కాకపోతే విజయం నా చేజారింది’’ అని తెలిపింది.

అయితే టో​క్యో ఒలింపిక్స్‌లో తన పోరాటం ఇంకా ముగియలేదన్న సింధు.. కాంస్య పతకం గెలిచే అవకాశం ఉందని పేర్కొంది. ‘‘ఎంతో మంది భారతీయ అభిమానులు నాకు మద్దతుగా నిలిచారు. ఫైనల్‌కు వెళ్లనందుకు బాధపడుతున్నా. అయితే, రేపటి మ్యాచ్‌లో పతకం సాధించేందుకు శక్తి మేరకు కృషి చేస్తా’’ అని సింధు చెప్పుకొచ్చింది. కాగా సెమీ ఫైనల్‌ మ్యాచ్‌లో 18-21, 12-21 తేడాతో సింధు తైజు చేతిలో ఓడిపోయిన సంగతి తెలిసిందే.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement