ఈసారి 7 నెలల ఐఎస్‌ఎల్‌ సీజన్‌ | This time the ISL season is 7 months long | Sakshi
Sakshi News home page

ఈసారి 7 నెలల ఐఎస్‌ఎల్‌ సీజన్‌

Jun 3 2026 3:47 AM | Updated on Jun 3 2026 3:47 AM

This time the ISL season is 7 months long

తాత్కాలిక షెడ్యూల్‌ విడుదల చేసిన ఏఐఎఫ్‌ఎఫ్‌

న్యూఢిల్లీ: ఇండియన్‌ సూపర్‌ లీగ్‌ (ఐఎస్‌ఎల్‌) 2026–27 సీజన్‌ ఈ ఏడాది సెప్టెంబర్ 1 నుంచి వచ్చే ఏడాది ఏప్రిల్‌ 11 వరకు సాగనుంది. పరిపాలన సహా పలు కారణాల వల్ల ఈ సీజన్‌లో మ్యాచ్‌ల సంఖ్యను తగ్గించారు. డబుల్‌ రౌండ్‌ రాబిన్‌ తరహాకు బదులు లీగ్‌లోని 14 జట్లు ఇతర జట్లతో ఒక్కోసారి మాత్రమే ఆడటంతో ఈ సీజన్‌లో 91 మ్యాచ్‌లే జరిగాయి. అయితే వచ్చే సీజన్‌లో ఎప్పట్లాగే ఇంటా, బయట పద్ధతిలో మ్యాచ్‌లు నిర్వహించనున్నారు. దీంతో ఐఎస్‌ఎల్‌ సీజన్‌ 7 నెలలకు పైగా సాగనుంది. 

ఈ మేరకు అఖిల భాతర ఫుట్‌బాల్‌ సమాఖ్య (ఏఐఎఫ్‌ఎఫ్‌) మంగళవారం తాత్కాలిక షెడ్యూల్‌ను ప్రకటించింది. ఇందులో స్వల్ప మార్పులకు అవకాశం ఉంది. వచ్చే ఏడాది ఏప్రిల్‌ 20 నుంచి మే 10 వరకు ఫెడరేషన్‌ కప్‌ జరగనుంది. ఐఎస్‌ఎల్‌ తర్వాత దేశంలో రెండో అతిపెద్ద ఫుట్‌బాల్‌ టోర్నమెంట్‌... ఇండియన్‌ ఫుట్‌బాల్‌ లీగ్‌ (ఐఎఫ్‌ఎల్‌) ఈ ఏడాది అక్టోబర్‌ 9 నుంచి వచ్చే ఏడాది మార్చి 14 వరకు సాగనుంది. 

ఇండియన్‌ వుమెన్స్‌ లీగ్‌ (ఐడబ్ల్యూఎల్‌) సెప్టెంబర్‌ 3 నుంచి జనవరి 24 వరకు నిర్వహించనున్నారు. డ్యురాండ్‌ కప్‌ జూలై 11 నుంచి ఆగస్టు 20 వరకు సాగనుండగా... ఇండియన్‌ వుమెన్స్‌ లీగ్‌ 2 (ఐడబ్ల్యూఎల్‌) జూలై 9 నుంచి ఆగస్టు 22 వరకు జరుగుతుంది. ఇక జాతీయ ఫుట్‌బాల్‌ చాంపియన్‌íÙప్‌ సంతోష్‌ ట్రోఫీ నవంబర్‌ 19 నుంచి వచ్చే ఏడాది జనవరి 17 వరకు నిర్వహించనున్నారు.

Advertisement
 
Advertisement
Advertisement