IPL 2022 Mega Auction: Tim David Bought By Mumbai Indians For INR 8.25 Crore - Sakshi
Sakshi News home page

IPL 2022 Mega Auction: 40 ల‌క్ష‌ల క‌నీస ధ‌ర.. కానీ ఏకంగా 8 కోట్లు.. ఎవ‌రీ టిమ్ డేవిడ్‌!

Feb 13 2022 7:44 PM | Updated on Feb 14 2022 9:23 AM

Tim David Bought By Mumbai Indians For INR 8 25 - Sakshi

సింగపూర్ ఆట‌గాడు టిమ్ డేవిడ్‌కు వేలంలో జాక్ పాట్ త‌గిలింది. ఐపీఎల్‌-2022 మెగా వేలంలో డేవిడ్‌ను ముంబై ఇండియన్స్ రూ. 8 కోట్ల‌కు కొనుగోలు చేసింది. రూ. 40 ల‌క్ష‌ల క‌నీస ధ‌రతో వేలంలోకి వ‌చ్చిన టిమ్ డేవిడ్ కోసం బెంగ‌ళూరు, ముంబై ఇండియ‌న్స్,ఢిల్లీ క్యాపిటల్స్ పోటీ పడ్డాయి. చివ‌ర‌కు ముంబై సొంతం చేసుకుంది. కాగా  గత సీజన్‌లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరుకు టిమ్ డేవిడ్ ప్రాతినిథ్యం వ‌హించాడు.

అయితే ఆ సీజ‌న్‌లో ఒకే ఒక మ్యాచ్‌లో ఆడే అవకాశం లభించింది. అందులో కేవంల 1 ప‌రుగు మాత్ర‌మే తీవ్రంగా నిరాశ‌ప‌రిచాడు. ఆ త‌రువాత అత‌డికి బెంగ‌ళూరు మ‌రి అవ‌కాశం ఇవ్వ‌లేదు. దీంతో మెగా వేలంలో త‌న  పేరును డేవిడ్ రిజిస్ట‌ర్ చేసుకున్నాడు.  హిట్టింగ్ స్కిల్స్ ఉన్న డేవిడ్‌ను ముంబై పోటీ ప‌డి మ‌రి ద‌క్కించుకుంది. బిగ్ బాష్ లీగ్, పాకిస్థాన్ సూపర్ లీగ్, టీ20 బ్లాస్ట్, ది హండ్రెడ్ వంటి టోర్నమెంట్‌లలో టిమ్ డేవిడ్ అద్భుతంగా రాణించాడు. డేవిడ్ ప్ర‌స్తుతం పాకిస్తాన్ సూప‌ర్ లీగ్‌లో అడుతున్నాడు.


 

Advertisement
 
Advertisement
Advertisement