తిలక్‌ వర్మ విధ్వంసకర సెంచరీ.. | Sakshi
Sakshi News home page

SMT 2023: తిలక్‌ వర్మ విధ్వంసకర సెంచరీ..

Published Mon, Oct 23 2023 12:15 PM

Tilak varma hits century in syed mushtaq ali trophy - Sakshi

సయ్యద్‌ ముస్తాక్‌ అలీ ట్రోఫీలో టీమిండియా యువ ఆటగాడు, హైదరాబాద్‌ కెప్టెన్‌ తిలక్‌ వర్మ తన సూపర్‌ ఫామ్‌ను కొనసాగిస్తున్నాడు. జైపూర్‌ వేదికగా బరోడాతో  జరుగుతున్న మ్యాచ్‌లో తిలక్‌ వర్మ అద్భుతమైన సెంచరీతో చెలరేగాడు. బరోడా బౌలర్లకు తిలక్‌ చుక్కలు చూపించాడు. ఈ మ్యాచ్‌లో కేవలం 69 బంతుల్లో 16 ఫోర్లు, 4 సిక్స్‌లతో 121 పరుగులు చేసి ఆజేయంగా నిలిచాడు.

తిలక్‌ విధ్వంసకర ఇన్నింగ్స్‌ ఫలితంగా తొలుత బ్యాటింగ్‌ చేసిన హైదరాబాద్‌ నిర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి  186 పరుగులు చేసింది. కాగా ఈ టోర్నీలో ఇప్పటివరకు ఐదు మ్యాచ్‌లు ఆడిన తిలక్‌ వర్మ 271 పరుగులతో.. టాప్‌-2 రన్‌ స్కోరర్‌గా కొనసాగుతున్నాడు. కాగా ఎనిమిది జట్లున్న గ్రూప్‌ ‘ఎ’లో హైదరాబాద్‌ ప్రస్తుతం 16 పాయింట్లతో ముంబై జట్టుతో కలిసి సంయుక్తంగా అగ్రస్థానంలో ఉంది. 
చదవండి: చాలా సంతోషంగా ఉంది.. చిన్న చిన్న తప్పులు సహజం! అతడొక మాస్టర్‌ క్లాస్‌: రోహిత్‌ శర్మ

Advertisement
 

తప్పక చదవండి

Advertisement