ఉరుగ్వేకు మూడో స్థానం | Third place for Uruguay | Sakshi
Sakshi News home page

ఉరుగ్వేకు మూడో స్థానం

Jul 15 2024 3:05 AM | Updated on Jul 15 2024 3:06 AM

Third place for Uruguay

చార్లోటి (అమెరికా): కోపా అమెరికా కప్‌ ఫుట్‌బాల్‌ టోర్నమెంట్‌లో మాజీ చాంపియన్‌ ఉరుగ్వే జట్టు మూడో స్థానాన్ని దక్కించుకుంది. ఆదివారం జరిగిన వర్గీకరణ మ్యాచ్‌లో ఉరుగ్వే ‘షూటౌట్‌’లో 4–3 గోల్స్‌ తేడాతో కెనడా జట్టును ఓడించింది.

నిర్ణీత సమయం ముగిశాక రెండు జట్లు 2–2తో సమంగా ఉండటంతో విజేతను నిర్ణయించేందుకు ‘షూటౌట్‌’ను నిర్వహించారు. రెగ్యులర్‌ టైమ్‌లో కెనడా తరఫున ఇస్మాయిల్‌ కోన్‌ (20వ ని.లో), జొనాథన్‌ డేవిడ్‌ (80వ ని.లో)... ఉరుగ్వే తరఫున రోడ్రిగో కోల్మన్‌ (8వ ని.లో), లూయిస్‌ స్వారెజ్‌ (90+2వ ని.లో) ఒక్కో గోల్‌ చేశారు.

Advertisement
 
Advertisement
Advertisement