T20 World Cup 2024: ఐర్లాండ్‌తో మ్యాచ్‌.. టాస్‌ గెలిచిన టీమిండియా.. ఓపెనర్‌గా కోహ్లి | T20 World Cup 2024: India Won The Toss And Choose To Field Against Ireland, Here Are Playing XI | Sakshi
Sakshi News home page

T20 World Cup 2024: ఐర్లాండ్‌తో మ్యాచ్‌.. టాస్‌ గెలిచిన టీమిండియా.. ఓపెనర్‌గా కోహ్లి

Jun 5 2024 7:49 PM | Updated on Jun 5 2024 8:00 PM

T20 World Cup 2024: India Won The Toss And Choose To Field Against Ireland, Here Are Playing XI

టీ20 వరల్డ్‌కప్‌ 2024లో భాగంగా గ్రూప్‌-ఏలో ఇవాళ (జూన్‌ 5) భారత్‌-ఐర్లాండ్‌ జట్లు పోటీపడుతున్నాయి. న్యూయార్క్‌ వేదికగా జరుగుతున్న ఈ మ్యాచ్‌లో టీమిండియా టాస్‌ గెలిచి తొలుత ఫీల్డింగ్‌ ఎంచుకుంది. భారత తుది జట్టులో యశస్వి జైస్వాల్‌, కుల్దీప్‌ యాదవ్‌, సంజూ శాంసన్‌లకు చోటు దక్కలేదు. జైస్వాల్‌ లేకపోవడంతో రోహిత్‌తో పాటు ఓపెనర్‌గా విరాట్‌ కోహ్లి బరిలోకి దిగే అవకాశం ఉంది.

తుది జట్లు..

భారత్: రోహిత్ శర్మ(కెప్టెన్‌), విరాట్ కోహ్లీ, రిషబ్ పంత్(వికెట్‌కీపర్‌), సూర్యకుమార్ యాదవ్, శివమ్ దూబే, హార్దిక్ పాండ్యా, రవీంద్ర జడేజా, అక్షర్ పటేల్, జస్ప్రీత్ బుమ్రా, అర్ష్‌దీప్ సింగ్, మహ్మద్ సిరాజ్

ఐర్లాండ్: పాల్ స్టిర్లింగ్(కెప్టెన్‌), ఆండ్రూ బల్బిర్నీ, లోర్కాన్ టక్కర్(వికెట్‌కీపర్‌), హ్యారీ టెక్టర్, కర్టిస్ కాంఫర్, జార్జ్ డాక్రెల్, గారెత్ డెలానీ, మార్క్ అడైర్, బారీ మెక్‌కార్తీ, జాషువా లిటిల్, బెంజమిన్ వైట్

 

Advertisement
 
Advertisement
Advertisement