T20 World Cup 2021: కోల్‌కతా ఓపెనర్‌ వెంకటేష్‌ అయ్యర్‌కు బంపర్ ఆఫర్..

T20 World Cup 2021: Venkatesh Iyer to join Indian team as net bowlers during T20 World Cup - Sakshi

Venkatesh Iyer to join Indian team as net bowlers during T20 World Cup: ఐపీఎల్ 2021 చివరి అంకానికి చేరుకుంది. నేడు (బుధవారం)జరుగనున్న క్వాలిఫైయర్‌-2, ఆక్టోబర్ 15న జరిగే ఫైనల్‌తో ఈ సీజన్ ముగుస్తున్నది. అయితే ప్రస్తుత సీజన్‌లో బ్యాటింగ్‌, బౌలింగ్‌లోను అద్భుతంగా రాణిస్తున్న కోల్‌కతా ఓపెనర్‌ వెంకటేష్‌ అయ్యర్‌కు బంఫర్‌ ఆఫర్‌ తగిలింది. టీ20 వరల్డ్ కప్‌లో టీమిండియాకు నెట్ బౌలర్‌గా అయ్యర్‌ సేవలు అందించనున్నాడు. ఈ క్రమంలో ఐపీఎల్ ముగిసిన తర్వాత ఇండియాకు తిరిగి వెళ్లకుండా యూఏఈలో ఉండాలని బీసీసీఐ ఆదేశించింది.

ఇప్పటికే ఎస్‌ఆర్‌హెచ్‌ బౌలర్‌ ఉమ్రాన్‌ మాలిక్‌,  ఢిల్లీ క్యాపిటల్స్‌ బౌలర్‌ ఆవేశ్‌ ఖాన్‌ కూడా నెట్‌ బౌలర్‌గా ఉన్న సంగతి తెలిసిందే. తాజాగా  వెంకటేష్‌ అయ్యర్‌ రావడంతో ఆ సంఖ్య మూడు కు చేరింది. మధ్యప్రదేశ్‌కు చెందిన ఈ యువ ఆల్‌రౌండర్‌ ఐపీఎల్‌ 2021 సీజన్‌లో కేకేఆర్‌ తరపున 8 మ్యాచ్‌ల్లో  265 పరుగులు , మూడు వికెట్లు సాధించాడు. కాగా ఆక్టోబర్ 24న భారత్‌ తన తొలి మ్యాచ్‌లో దాయాది దేశం పాక్‌తో తలపడనుంది.

చదవండిT20 World Cup 2021: టీమిండియా నెట్‌ బౌలర్‌గా ఆవేశ్‌ఖాన్

Read latest Sports News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top