T20 WC 2021 IND Vs PAK: 'మౌకా మౌకా'... అరె భయ్యా ఈసారైనా

T20 World Cup 2021: Star Sports Release New Mauka Mauka Add IND Vs PAK - Sakshi

India Vs Pakistan T20 WC 2021.. మౌకా.. మౌకా అనగానే మొదటగా గుర్తుకు వచ్చేది ఇండియా- పాకిస్తాన్‌ మ్యాచ్‌. ఇరుజట్ల మధ్య మ్యాచ్‌ అంటే ఎంత రసవత్తరంగా ఉంటుందో.. అదే స్థాయిలో మౌకా మౌకా యాడ్‌ కూడా బాగా పాపులర్‌ అయింది. పాకిస్తాన్‌, టీమిండియాలు ఐసీసీ మేజర్‌ టోర్నీల్లో ఎప్పుడు తలపడినా పాకిస్తాన్‌ అభిమాని బాక్స్‌లో క్రాకర్స్‌తో కనిపిస్తాడు.ప్రతీసారి పాక్‌ గెలిచినప్పుడు క్రాకర్స్‌ కాల్చాలని భావిస్తాడు. పాపం ఆ అభిమానికి ప్రతీసారి నిరాశే ఎదురవుతూ వస్తుంది. దీంతో తనతో తెచ్చుకున్న క్రాకర్స్‌ బాక్స్‌ను మళ్లీ గదిలో పడేసి మరో మ్యాచ్‌ కోసం ఎదురుచూస్తూ ఉంటాడు.ఇది క్లుప్తంగా యాడ్‌.

చదవండి: T20 World Cup 2021: హార్దిక్‌ పాండ్యా జట్టులోనే.. బౌలింగ్‌ మాత్రం చేయడు!

స్టార్‌స్పోర్ట్‌ నెట్‌వర్క్‌ ఈ మౌకా మౌకా యాడ్‌ను 2015 వన్డే ప్రపంచకప్‌ సందర్భంగా తొలిసారి  తీసుకొచ్చింది. తాజాగా టి20 ప్రపంచకప్‌ 2021లో ఇండియా- పాకిస్థాన్‌లు మరోసారి తలపడనుండడంతో స్టార్‌స్పోర్ట్స్‌ నెట్‌వర్క్‌ మౌకా.. మౌకా యాడ్‌ను సరికొత్త రూపంలో తీసుకొచ్చింది. ఈసారి టి20 ప్రపంచకప్‌ యూఏఈలో జరగనుండడంతో పాక్‌ అభిమాని దుబాయ్‌ ఎయిర్‌పోర్ట్‌లో క్రాకర్స్‌ బాక్స్‌తో ప్రత్యక్షమయ్యాడు. అక్కడ ఒక భారత అభిమాని పాక్‌ అభిమానిని విష్‌ చేస్తాడు. ఈసారి మ్యాచ్‌ మేమే గెలుస్తామని పాక్‌ అభిమాని చెప్పగానే.. అవును గెలుస్తారు.. కానీ మీరు కాదు మేము అంటూ రెండు టీవీలు చేతిలో పెడతాడు.

చదవండి: T20 World Cup 2021: టీమిండియాలో అనూహ్య మార్పు..

రెండు టీవీలు ఎందుకని పాక్‌ అభిమాని అడుగుతాడు. దానికి ఇండియా అభిమాని.. ఏం లేదు.. ఒక టీవీ మ్యాచ్‌ చూడడానికి.. మరొకటి పగులగొట్టడానికని సమాధానమిస్తాడు. అంటే ఈ మ్యాచ్‌లో కూడా టీమిండియాదే విజయం అంటూ పరోక్షంగా చెప్పాడు. దీనికి ఇండియా అభిమాని ''బై వన్‌.. బ్రేక్‌ వన్‌'' ఆఫర్‌ చెప్పడంతో మౌకా.. మౌకా అంటూ యాడ్‌ ముగుస్తుంది. ప్రస్తుతం మౌకా- మౌకా యాడ్‌ సోషల్‌ మీడియాను ఒక ఊపు ఊపుతుంది. వీలైతే మీరు కూడా ఒక లుక్కేయండి. ఇక అక్టోబర్‌ 24న టీమిండియా, పాకిస్తాన్‌ల మధ్య మ్యాచ్‌ జరగనుంది.

చదవండి: Ind Vs NZ Series: న్యూజిలాండ్‌ సిరీస్‌కు కోచ్‌గా రాహుల్‌ ద్రవిడ్‌!

Read latest Sports News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top