'నన్ను విమర్శించినోళ్లు భారతీయులే కాదు' | Mohammed Shami Says They Are Not Indians Slams Online Abusers IND Vs Pak | Sakshi
Sakshi News home page

Mohammed Shami: 'నన్ను విమర్శించినోళ్లు భారతీయులే కాదు'

Mar 1 2022 12:38 PM | Updated on Mar 1 2022 12:42 PM

Mohammed Shami Says They Are Not Indians Slams Online Abusers IND Vs Pak - Sakshi

గతేడాది జరిగిన టి20 ప్రపంచకప్‌లో పాకిస్తాన్‌తో మ్యాచ్‌లో టీమిండియా దారుణ ఓటమి చవిచూసిన సంగతి తెలిసిందే. మెగాటోర్నీలో పాక్‌పై తమకున్న ఘనమైన రికార్డును టీమిండియా కోల్పోయింది. పాక్‌తో జరిగిన మ్యాచ్‌ టీమిండియా 10 వికెట్ల తేడాతో ఘోర పరాజయాన్ని చవిచూసింది. ఈ మ్యాచ్‌లో షమీ 3.5 ఓవర్లు బౌల్‌ చేసి ఏకంగా 43 పరుగులు సమర్పించుకున్నాడు. దీంతో ఓటమికి భారత ప్రధాన పేసర్‌ మహ్మద్‌ షమీయే కారణమంటూ కొందరు గిట్టనివాళ్లు అప్పట్లో సోషల్‌ మీడియాలో రచ్చ చేశారు. షమీ పాక్‌కు అమ్ముడుపోయాడని.. అతన్ని పాక్‌కు తరిమికొట్టాలంటూ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. కాగా షమీపై జరిగిన దాడిని టీమిండియా మాజీ క్రికెటర్లు వీరేంద్ర సెహ్వాగ్‌, ఇర్ఫాన్‌ పఠాన్‌ సహా పలువురు ఖండించారు.

తాజాగా షమీ తనపై చేసిన విమర్శలపై ఎట్టకేలకు మౌనం వీడాడు. ఇండియన్‌ ఎక్స్‌ప్రెస్‌తో జరిగిన ఇంటర్య్వూలో షమీ మాట్లాడాడు. ''మంచి ప్రదర్శన చేస్తే హీరో అంటారు.. ఒక్క మ్యాచ్‌లో చెత్త ప్రదర్శన వస్తే జీరో అంటారు.  ఇలా ఒక ఆటగాడిని హీరోగా పరిగణించి ఆ తర్వాత అదే ఆటగాడిపై  దురుసుగా ప్రవర్తిసే.. కచ్చితంగా వాళ్లు భారతీయులు మాత్రం కాదు. వాళ్లు మన దేశానికి చెందినవారే కానప్పుడు ఇలాంటి స్టేట్‌మెంట్స్ ఎన్ని చెప్పినా నా దృష్టిలో అవి పనికిరానివే. ఒకటి మాత్రం స్పష్టంగా చెప్పగలను.  

అంతేకాదు ఎవరైనా నా గురించి బాధ కలిగించే మాటలు మాట్లాడితే.. అతను నాకు లేదా భారత జట్టుకు అభిమాని కానేకాదు. ఇలాంటి సందర్భాల్లో ఏం చేయాలో నాకు తెలుసు. భారతదేశం అంటే ఏమిటో మనకు చెప్పాల్సిన అవసరం లేదు. మేము దేశానికి ప్రాతినిధ్యం వహిస్తాం. దేశం కోసం పోరాడుతున్నాం. కాబట్టి ఇలాంటి ట్రోల్స్‌ను అస్సలు పట్టించుకోము'' అంటూ పేర్కొన్నాడు. ఇక టీమిండియా తరపున మహ్మద్‌ షమీ 57 టెస్టుల్లో 209 వికెట్లు.. 79 వన్డేల్లో 148 వికెట్లు.. టి20ల్లో 18 వికెట్లు తీశాడు.

చదవండి: కెప్టెన్‌గా ఓకే రోహిత్‌.. మరి బ్యాటింగ్‌ సంగతి ఏంటి ?: భారత మాజీ క్రికెటర్‌

Ashton Agar: నీ భ‌ర్త ప్రాణాల‌తో తిరిగిరాడు.. పాక్ ప‌ర్య‌ట‌న‌కు ముందు బెదిరింపులు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement