T20 World Cup 2021: అఫ్గాన్‌ టీ20 కెప్టెన్‌గా మహ్మద్‌ నబీ

T20 World Cup 2021: Mohammad Nabi Named Afghanistan Captain - Sakshi

కాబుల్‌: అఫ్గానిస్తాన్ టీ20 కెప్టెన్‌గా స్టార్‌ ఆల్‌రౌండర్‌ మహ్మద్‌ నబీ ఎంపికయ్యాడు. ఈ విషయాన్ని అతడు ట్విటర్‌ ద్వారా వెల్లడించాడు. ‘ఈ క్లిష్టమైన దశలో టీ20 ఫార్మాట్‌లో జాతీయ క్రికెట్‌ జట్టుకు నాయకత్వం వహించాలని అఫ్గాన్‌స్థాన్‌ క్రికెట్‌ బోర్డు తీసుకున్న నిర్ణయాన్ని గౌరవిస్తున్నా. ఆల్లా దయతో టీ20 ప్రపంచకప్‌లో దేశం గర్వపడే విధంగా రాణిస్తాం’ అని నబీ ట్వీట్ చేశాడు. తనను సంప్రదించకుండా టీ20 ప్రపంచకప్‌లో ఆడే అఫ్గానిస్థాన్ జట్టును ప్రకటించడంపై రషీద్ ఖాన్  కెప్టెన్సీ నుంచి వైదొలిగిన సంగతి తెలిసిందే. 

అఫ్గానిస్తాన్ జట్టు: రషీద్‌ఖాన్‌, ముజీబ్‌ ఉర్‌ రహ్మాన్‌, రహ్మానుల్లా గుర్బాజ్‌, కరీమ్‌ జనత్‌, హజ్రతుల్లా జాజాయ్‌, గుల్బాడిన్‌ నైబ్‌, ఉస్మాన్‌ ఘని, నవీన్‌ ఉల్‌ హక్‌, అస్ఘర్‌ అఫ్గాన్‌, హమీద్‌ హసన్‌, మహ్మద్‌ నబి, షరాఫుద్దీన్‌ అష్రాఫ్‌, నజీబుల్లా జద్రాన్‌, దావ్లత్‌ జద్రాన్‌, హష్మతుల్లా షాహిది, షాపూర్‌ జద్రాన్‌, మహ్మద్‌ షహ్జాద్‌, కాయిస్‌ అహ్మద్.

చదవండిఅఫ్గాన్‌ టీ20 జట్టు: కెప్టెన్‌ బాధ్యతల నుంచి తప్పు​కున్న రషీద్‌ ఖాన్‌

Read latest Sports News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top