ధోని, రవిశాస్త్రి మధ్య ఏం జరిగింది.. కోహ్లినే కారణమా!

T20 World Cup 2021: Dhoni-Ravi Shastri Heat Argument Lost NZ Pics Viral - Sakshi

Heat Argument Between Dhoni And Ravi Shastri Viral After NZ Match.. టీమిండియా మెంటార్‌ ఎంఎస్‌ ధోని, కోచ్‌ రవిశాస్త్రి మధ్య జరిగిన సీరియస్‌ సంభాషణకు సంబంధించిన ఫోటోలు సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారాయి. వారి మధ్య ఏం చర్చకు వచ్చిందన్నది తెలియదు గానీ దీనిపై అభిమానులు మధ్య మాత్రం కొత్త చర్చ నడిచింది.  దీంతో టీమిండియా కెప్టెన్‌ విరాట్‌ కోహ్లి,  ధోని, రవిశాస్త్రి మధ్య అంతా బాగానే ఉందా అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. కాగా న్యూజిలాండ్‌తో మ్యాచ్‌లో ఓటమి అనంతరం ధోని తన కూల్‌నెస్‌ను కోల్పోయాడని సమాచారం. ఇందులో భాగంగానే ధోని, రవిశాస్త్రి మధ్య సీరియస్‌ సంభాషణ జరిగినట్లు తెలుస్తోంది.  ఫోటోల్లో కూడా ధోని లుక్స్‌ సీరియస్‌గా ఉండడంతో ఆ వార్తలు నిజమేననిపిస్తుంది. 

చదవండి: Rohit Sharma: వన్డే, టి20 కెప్టెన్‌గా రోహిత్‌.. కోహ్లి టెస్టులకే పరిమితం..?!

అయితే ధోని కోపానికి పరోక్షంగా కోహ్లినే కారణమా అని కొందరు పేర్కొంటున్నారు. వరుణ్‌ చక్రవర్తి స్థానంలో రవిచంద్రన్‌ అశ్విన్‌ ఎంపికచేయకపోవడం.. హార్దిక్‌ పాండ్యాను వద్దన్నా ఎందుకు ఆడించాడనేదానిపై ధోని రవిశాస్త్రితో చర్చించినట్లు తెలుస్తోంది. అంతేగాక రోహిత్‌ శర్మను బ్యాటింగ్‌ ఆర్డర్‌లో డిమోట్‌ చేయడం వెనుక కూడా ధోని సీరియస్‌ అయినట్లు సమాచారం. మరోవైపు మెంటార్‌గా తన సలహాలు కోహ్లి వినడం లేదని బీసీసీఐకి ధోని ఫిర్యాదు చేసినట్లు మరో వార్త కూడా చక్కర్లు కొడుతుంది. ఈ వార్తల్లో నిజమెంతో తెలియదు గానీ అభిమానులు మాత్రం ఎవరికి వారు ఏవేవో ఊహాగానాలు వ్యక్తం చేస్తున్నారు. 

చదవండి: Virat Kohli On India Loss: అలా చేయలేకపోయాం.. అందుకే రెండింటిలో ఓడిపోయాం..

ఇక సూపర్‌ 12 దశలో వరుసగా రెండు మ్యాచ్‌ల్లో ఓటమి పాలైన టీమిండియా రేపు(నవంబర్‌ 3న) అఫ్గనిస్తాన్‌తో మ్యాచ్‌ ఆడనున్న సంగతి తెలిసింది. ఇక సెమీస్‌ అవకాశాలు దాదాపు కోల్పోయిన టీమిండియా మరో మూడు మ్యాచ్‌ల్లో భారీ విజయాలు అందుకున్నప్పటికీ ఇతర జట్ల ఫలితాలపై ఆధారపడాల్సి ఉంటుంది.

Read latest Sports News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram 

Read also in:
Back to Top