రోహిత్‌ శర్మతో పాటు షకీబ్‌!.. ఎవరికీ సాధ్యం కాని రికార్డు! | Sakshi
Sakshi News home page

రోహిత్‌ శర్మతో పాటు షకీబ్‌ కూడా..! ప్రపంచంలోనే తొలిసారి ఇలా

Published Wed, May 15 2024 5:51 PM

T20 WC Shakib Al Joins Rohit Sharma In Rare List: Becomes 2nd Player In World

బంగ్లాదేశ్‌ జట్టు స్టార్‌ ఆల్‌రౌండర్, మాజీ కెప్టెన్‌ షకీబ్‌ అల్‌ హసన్‌ సరికొత్త చరిత్ర సృష్టించాడు. వరుసగా తొమ్మిదోసారి టీ20 ప్రపంచకప్‌ టోర్నీలో పాల్గొంటున్న రెండో ఆటగాడిగా రికార్డులకెక్కాడు. ఈ జాబితాలో టీమిండియా కెప్టెన్‌ రోహిత్‌ శర్మ షకీబ్‌ కంటే ముందుగానే తన పేరును లిఖించుకున్నాడు.

కాగా జూన్‌ 1 నుంచి వరల్డ్‌కప్‌-2024 టోర్నీ ఆరంభం కానుంది. అమెరికా- వెస్టిండీస్‌ సంయుక్తంగా ఈ మెగా ఈవెంట్‌కు ఆతిథ్యం ఇవ్వనున్నాయి. ఈ నేపథ్యంలో ఏప్రిల్‌ 30న భారత క్రికెట్‌ నియంత్రణ మండలి తమ జట్టును ప్రకటించింది. రోహిత్‌ శర్మ కెప్టెన్సీలో ఈ టోర్నీలో పాల్గొనే 15 మంది సభ్యుల పేర్లు వెల్లడించింది.

కాగా 2007లో తొలిసారి టీ20 ప్రపంచకప్‌ ఈవెంట్‌ ఆరంభించగా రోహిత్‌ శర్మ అప్పటి నుంచి ఈ మెగా టోర్నీ ఒక్కసారి కూడా మిస్‌ కాలేదు. వరుసగా తొమ్మిదో ఎడిషన్‌లోనూ ఆడేందుకు హిట్‌మ్యాన్‌ సిద్దమయ్యాడు. ఈసారి.. రెండో దఫా కెప్టెన్‌ హోదాలో అతడు బరిలోకి దిగనున్నాడు. ఇక జూన్‌ 5న టీమిండియా తమ తొలి మ్యాచ్‌ ఐర్లాండ్‌తో ఆడనుంది.

ఇదిలా ఉంటే.. బంగ్లాదేశ్‌ వరల్డ్‌కప్‌ కోసం మంగళవారం తమ జట్టును ప్రకటించింది. ఇందులో షకీబ్‌ అల్‌ హసన్‌కు స్థానం దక్కింది. ఇక జూన్‌ 7 న బంగ్లాదేశ్‌ శ్రీలంకతో మ్యాచ్‌తో ప్రపంచకప్‌ జర్నీ ఆరంభించనుంది.

ఈ నేపథ్యంలో పొట్టి క్రికెట్‌ ప్రపంచకప్‌లో వరుసగా ఆడుతున్న క్రికెటర్ల జాబితాలో రోహిత్‌ శర్మ ముందంజలో నిలవగా.. షకీబ్ రెండోస్థానం ఆక్రమించాడు. కాగా ఇప్పటి వరకు ప్రపంచకప్‌లలో 36 మ్యాచ్‌లు ఆడిన షకీబ్‌ 742 పరుగులు చేయడంతోపాటు 47 వికెట్లు పడగొట్టాడు.

టీ20 ప్రపంచకప్‌లో ఇప్పటి వరకు అత్యధికసార్లు పాల్గొన్న/పాల్గొనబోతున్న ఆటగాళ్లు
👉రోహిత్‌ శర్మ- 9- 2007, 2009, 2010, 2011, 2014, 2016, 2021, 2022, 2024.
👉షకీబ్‌ అల్‌ హసన్‌- 9- 2007, 2009, 2010, 2011, 2014, 2016, 2021, 2022, 2024.
👉మహ్మదుల్లా- 8- 2007, 2009, 2010, 2011, 2014, 2016, 2021, 2024.
👉డేవిడ్‌ వార్నర్‌- 8- 2009, 2010, 2011, 2014, 2016, 2021, 2022, 2024.
👉క్రిస్‌ గేల్‌- 7- 2007, 2009, 2010, 2011, 2014, 2016, 2021.
👉డ్వేన్‌ బ్రావో- 2007, 2009, 2010, 2011, 2014, 2016, 2021

టీ20 ప్రపంచకప్‌ కోసం బంగ్లాదేశ్‌ జట్టు: 
నజ్ముల్‌ హొస్సేన్‌ (కెపె్టన్‌), టస్కిన్‌ అహ్మద్‌ (వైస్‌ కెప్టెన్‌), లిటన్‌ దాస్, సౌమ్య సర్కార్, తన్‌జిద్‌ హసన్, షకీబ్, తౌహిద్, మహ్ముదుల్లా, జాకీర్‌ అలీ, తన్వీర్‌ ఇస్లామ్, మెహదీ హసన్, రిషాద్, ముస్తఫిజుర్, షోరిఫుల్, తన్‌జీమ్‌ హసన్‌.  

చదవండి: అతడి కంటే చెత్త కెప్టెన్‌ ఇంకొకరు లేరు.. పైగా హార్దిక్‌ను అంటారా?.. గంభీర్‌ ఫైర్‌

Advertisement
 
Advertisement
 
Advertisement