టీ20 వరల్డ్‌కప్‌లో ఆ జట్టుకు షాక్‌.. అత్యాచారం కేసులో క్రికెటర్‌ అరెస్ట్‌ 

T20 WC 2022: Sri Lanka Cricketer Gunathilaka Arrested For Molestation Accusation In Sydney - Sakshi

టీ20 వరల్డ్‌కప్‌-2022లో పాల్గొన్న ఓ కీలక జట్టు సభ్యుడు అత్యాచారం కేసులో అరెస్టయ్యాడు. గాయం కారణంగా టోర్నీ మధ్యలోనే జట్టును వీడిన శ్రీలంక ఓపెనింగ్‌ బ్యాటర్‌ ధనుష్క గుణతిలకపై సిడ్నీకు చెందిన యువతి ఆత్యాచార ఆరోపణలు చేసింది. దీంతో రంగంలోకి దిగిన సిడ్నీ పోలీసులు స్వదేశానికి పయనమయ్యేందుకు రెడీగా ఉన్న గుణతిలను ఇవాళ ఉదయం ఎయిర్‌పోర్టులో అదుపులోకి తీసుకున్నారు. దీంతో శ్రీలంక జట్లు గుణతిలక లేకుండానే స్వదేశానికి బయల్దేరింది.

టోర్నీ ఓపెనర్‌లో శ్రీలంక.. నమీబియా చేతిలో ఓడిన మ్యాచ్‌లో సభ్యుడిగా ఉన్న గుణతిలక, ఆ మ్యాచ్‌లో గాయం కావడంతో జట్టుకు దూరంగా ఉన్నాడు. అయితే, రీప్లేస్‌మెంట్‌ ఆటగాడు జట్టులో చేరే వరకు అతన్ని ఆస్ట్రేలియాలోనే ఉండాల్సిందిగా లంక క్రికెట్‌ బోర్డు అదేశించడంతో గుణతిలక అక్కడే ఉండిపోయాడు. ఈ మధ్యలోనే అతను స్థానిక యువతి ఆత్యాచారం చేసినట్లు సిడ్నీ పోలీసులు తెలిపారు.

శ్రీలంక తరఫున 100కు పైగా అంతర్జాతీయ మ్యాచ్‌లు ఆడిన గుణతిలక.. గతంలో కూడా ఇదే తరహా ఆరోపణలు ఎదుర్కొన్నాడు. స్వదేశంలో ఓ నార్వే అమ్మాయి గుణతిలకతో పాటు అతని స్నేహితుడిపై అత్యాచార ఆరోపణలు చేసింది. అయితే గుణతిలక ఆ కేసులో నుంచి బయటపడ్డాడు. పరిమిత ఓవర్ల ఫార్మాట్‌లో కీలక సభ్యుడిగా ఉన్న గుణతిలక తరుచూ గాయాల బారిన పడుతూ జట్టుకు దూరమవుతున్నాడు. అతనికి పరిమిత ఓవర్ల ఫార్మాట్‌లో మంచి రికార్డు ఉంది. వన్డేల్లో 2 సెంచరీలు, 11 హాఫ్‌ సెంచరీలు, టీ20ల్లో 3 హాఫ్‌ సెంచరీలతో ప్రామిసింగ్‌ బ్యాటర్‌గా పేరు తెచ్చుకున్నాడు.  

 

మీ అభిప్రాయం చెప్పండి

Loading...

Read latest Sports News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top