ఆంధ్రను గెలిపించిన స్టీఫెన్‌ | Syed Mushtaq Ali Trophy 2021 Group C: Andhra returns to winning ways | Sakshi
Sakshi News home page

ఆంధ్రను గెలిపించిన స్టీఫెన్‌

Nov 7 2021 5:17 AM | Updated on Nov 7 2021 5:23 AM

Syed Mushtaq Ali Trophy 2021 Group C: Andhra returns to winning ways - Sakshi

వడోదర: సయ్యద్‌ ముస్తాక్‌ అలీ ట్రోఫీ దేశవాళీ టి20 క్రికెట్‌ టోర్నమెంట్‌లో ఆంధ్ర జట్టు ఖాతా లో రెండో విజయం చేరింది. జార్ఖండ్‌ జట్టుతో శనివారం జరిగిన ఎలైట్‌ గ్రూప్‌ ‘సి’ లీగ్‌ మ్యాచ్‌లో ఆంధ్ర ఎనిమిది పరుగుల తేడాతో గెలిచింది. ఆంధ్ర బౌలర్లు చీపురపల్లి స్టీఫెన్‌ (3/23), హరిశంకర్‌ రెడ్డి (3/24) రాణించారు. 166 పరుగుల లక్ష్యాన్ని ఛేదించేందుకు బరిలోకి దిగిన జార్ఖండ్‌ నిర్ణీత 20 ఓవర్లలో 9 వికెట్లకు 157 పరుగులు చేసి ఓడిపో యింది. చివరి ఓవర్‌లో జార్ఖండ్‌ విజయానికి 10 పరుగులు అవసరమయ్యాయి. చేతిలో ఐదు వికెట్లున్నాయి.

అయితే జార్ఖండ్‌ ఒక్క పరుగు మాత్రమే చేసి నాలుగు వికెట్లు (రెండు వికెట్లు స్టీఫెన్, రెండు రనౌట్‌లు) కోల్పోయింది. ఆఖరి ఓవర్‌ వేసిన ఆంధ్ర బౌలర్‌ స్టీఫెన్‌ కేవలం ఒక్క పరుగు మాత్రమే ఇచ్చి జార్ఖండ్‌ను కట్టడి చేశాడు. ఆంధ్ర వికెట్‌ కీపర్‌ శ్రీకర్‌ భరత్‌ నాలుగు క్యాచ్‌లు తీసుకోవడంతోపాటు ఒక రనౌట్‌లో పాలుపంచుకున్నాడు. అంతకుముందు తొలుత బ్యాటింగ్‌ చేసిన ఆంధ్ర నిర్ణీత 20 ఓవర్లలో 4 వికెట్లకు 165 పరుగులు చేసింది. అశ్విన్‌ హెబ్బార్‌ (45; 6 ఫోర్లు), శ్రీకర్‌ భరత్‌ (48; 5 ఫోర్లు), రికీ భుయ్‌ (15 బంతుల్లో 34 నాటౌట్‌; 3 ఫోర్లు, 2 సిక్స్‌లు) ఆకట్టుకున్నారు.

Advertisement
 
Advertisement
Advertisement