Wrestler Sushil Kumar: సుశీల్‌ హాకీ స్టిక్‌తో... 

Sushil Kumar Image Shows He Attacked Young Wrestlers Who Succumbs - Sakshi

న్యూఢిల్లీ: రెజ్లర్‌ సుశీల్‌ కుమార్‌ను దోషిగా చూపిస్తున్న దృశ్యం ఇదేనా! పోలీసులు సాక్ష్యంగా చెబుతున్న వీడియోలో సుశీల్‌ చేతిలో స్టిక్‌ ఉండగా, ఇద్దరు వ్యక్తులు నేలపై పడి దెబ్బలు తింటున్నట్లుగా కనిపిస్తోంది. సుశీల్‌ పక్కనే ఉన్న కొందరు వారిని చావబాదుతున్నట్లుగా పూర్తి వీడియోలో ఉన్నట్లు సమాచారం. దీనిపై పోలీసులనుంచి ఇంకా అధికారికంగా స్పష్టత రాకున్నా... ఢిల్లీ రెజ్లింగ్‌ వర్గాల్లో ఈ వీడియో చక్కర్లు కొడుతోంది. మే 4న సాగర్‌ రాణా అనే యువ రెజ్లర్‌ చనిపోయిన ఈ ఘటనలో సుశీల్‌ నిందితుడిగా ఉన్నాడు.   

ఇక ఈ హత్య కేసులో ఉద్దేశపూర్వకంగానే కొంతమంది సుశీల్‌కుమార్‌ను ఇరికించారని, దీనంతటి వెనుక పెద్ద కుట్ర ఉందని అతడి తరఫు లాయర్‌ బీఎస్‌ జాఖడ్‌ ఆరోపిస్తున్నారు. ఘటన జరిగిన ఛత్రశాల్‌ స్టేడియానికి వెళ్లి గాయపడిన ముగ్గురి స్టేట్‌మెంట్‌ రికార్డు చేయగా వారెవరూ సుశీల్‌ దాడి చేసినట్లుగా చెప్పలేదని, కానీ సాగర్‌ చనిపోయాక మాత్రమే కిడ్నాపింగ్, మర్డర్‌ కేసు పెట్టారని పేర్కొన్నారు. సుశీల్‌ కొట్టినట్లుగా చెబుతున్న వీడియోను అందరి ముందు బహిర్గతపర్చవచ్చు కదా అని సవాల్‌ విసిరారు. ఈ క్రమంలో ఈ దృశ్యాలు బయటపడటం గమనార్హం.

చదవండి: భూ తగాదాలు... గ్యాంగ్‌స్టర్‌లు... ప్రాణభయం

Read latest Sports News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top