IPL 2022 Playoffs New Rules: ప్లే ఆఫ్‌ మ్యాచ్‌లు వర్షం కారణంగా రద్దయితే..?

Super Over to determine results if rain plays spoilsport,Check IPL 2022 Playoff RULES - Sakshi

ఐపీఎల్‌-2022 తుది దశకు చేరుకుంది. ఇప్పటికే లీగ్‌ మ్యాచ్‌లు ముగియగా.. ప్లే ఆఫ్స్‌కు ఆయా జట్లు సిద్దమవుతున్నాయి. ఇక కోల్‌కతాలోని ఈడెన్‌ గార్డెన్స్‌ వేదికగా మంగళవారం(మే24) తొలి క్వాలిఫయర్ మ్యాచ్‌లో రాజస్థాన్ రాయల్స్‌తో గుజరాత్ టైటాన్స్ తలపడనుంది.

అదే విధంగా మే25న ఎలిమినేటర్ మ్యాచ్‌లో రాయల్‌ ఛాలెంజర్స్ బెంగళూరు‌, లక్నో సూపర్‌ జెయింట్స్‌ జట్లు అమీతుమీ తేల్చుకోనున్నాయి. అయితే కోల్‌కతా వేదికగా జరిగే ఈ రెండు మ్యాచ్‌లకు వర్షం ముప్పు పొంచి ఉంది. ఈ క్రమంలో ప్లే ఆఫ్స్‌కు,ఫైనల్‌కు బీసీసీఐ కొత్త నిబంధనలను రూపొందించింది.

ఐపీఎల్‌ ప్లే ఆఫ్‌ మ్యాచ్‌లకు వరుణుడు ఆటంకం కలిగించి, నిర్ణీత సమయంలో ఆట సాధ్యం కాకపోతే సూపర్‌ ఓవర్‌ ద్వారా విజేతను తేలుస్తారు. ఒక వేళ  సూపర్‌ ఓవర్‌ సాధ్యం కాకపోతే పాయింట్ల పట్టిక ఆధారంగా విజేతను నిర్ణయిస్తారు. కాగా క్వాలిఫైయర్ 1, ఎలిమినేటర్, క్వాలిఫైయర్ 2 కోసం ఎటువంటి రిజర్వ్ డేను బీసీసీఐ కేటాయించలేదు. అయితే ఫైనల్‌కు మాత్రం రిజర్వ్ డేను కేటాయించారు. ఒక వేళ మే29న ఫైనల్‌కు ఎటువంటి అంతరాయం కలిగినా.. మ్యాచ్‌ను తిరిగి మే 30న నిర్వహించనున్నారు.

క్వాలిఫైయర్ 1, ఎలిమినేటర్ మ్యాచులతో పాటు అహ్మదాబాద్‌లో జరిగే క్వాలిఫైయర్ 2 మ్యాచ్‌కు రెండు గంటల రిజర్వు టైమ్‌ని కేటాయిస్తూ బీసీసీఐ నిర్ణయం తీసుకుంది.

ఒక వేళ వర్షం కారణంగా మ్యాచ్‌ ప్రారంభం ఆలస్యమైతే రెండు గంటల వరకు నిర్ణీత 20 ఓవర్లలో ఎటువంటి కుదింపు ఉండదు.

అదే విధంగా మ్యాచ్‌కు వర్షం కారణంగా అంతరాయం కలిగితే ఇన్నింగ్స్‌ బ్రేక్‌ 20 నిమిషాలను 10 నిమిషాలకు కుదిస్తారు. 

వర్షం వల్ల మ్యాచ్‌ కటాఫ్‌ టైం దాటిపోతే.. ప్లేఆఫ్ మ్యాచ్‌ల్లో ఇరు జట్లు అయిదేసి ఓవర్ల చొప్పున ఇడే ఆవకాశం ఉంటుంది. ప్లేఆఫ్స్‌లో కనీసం 5-5 ఓవర్ల మ్యాచ్ జరగడానికి రాత్రి 11.56 వరకు అవకాశం ఉంటుంది. కాగా ఐదు ఓవర్ల మ్యాచ్‌కు ఎటువంటి టైమ్‌అవుట్‌లు ఉండవు. 

ఒకవేళ ఫైనల్లో ఐదు ఓవర్ల మ్యాచ్‌కు కటాఫ్‌ సమయం  తెల్లవారుజామున 12:26 నిమిషాలు.

క్వాలిఫైయర్ 1, ఎలిమినేటర్, క్వాలిఫైయర్ 2 వర్షం కారణంగా రద్దు అయితే?
ప్లే ఆఫ్స్‌ మ్యాచ్‌‍ల్లో అదనపు సమయం ముగిసేలోగా కనీసం ఐదు ఓవర్ల మ్యాచ్‌ని కూడా నిర్వహించడానికి సాధ్యం కాకపోతే.. సూపర్ ఓవర్‌ ద్వారా ఫలితాన్ని నిర్ణయిస్తారు.

ఈ మ్యాచ్‌లకు  సూపర్ ఓవర్ కటాఫ్‌ టైమ్‌ ఉదయం 12:50  నిమిషాలు.

సూపర్ ఓవర్ కూడా సాధ్యం కాని తరుణంలో లీగ్‌ పాయింట్ల పట్టికలో మెరుగైన స్థానంలో ఉన్న జట్టును విజేతగా నిర్ణయిస్తారు.

► ప్లే ఆఫ్‌ మ్యాచ్‌లకు రిజర్వ్ డే లేనుందున.. ఈ మ్యాచ్‌ల్లో ఒక ఇన్నింగ్స్ పూర్తి అయ్యాక.. రెండో ఇన్నింగ్స్‌ మధ్యలో వరుణుడు అంతరాయం కలిగిస్తే.. డక్‌వర్త్-లూయిస్ పద్దతి ప్రకారం మ్యాచ్‌ ఫలితాన్ని తేలుస్తారు.

ఫైనల్‌ రూల్స్‌

ఒకవేళ ఫైనల్ మ్యాచ్ మే 29న ప్రారంభమై మధ్యలో ఆగిపోతే, రిజర్వ్ డే రోజున మిగతా మ్యాచ్‌ను నిర్వహిస్తారు.

ఫైనల్‌లో టాస్ వేసిన తర్వాత ఆట సాధ్యం కాని పక్షంలో, రిజర్వ్ రోజున జట్లకు మళ్లీ తాజాగా టాస్ ఉంటుంది.

ఫైనల్‌కు అంతరాయం కలిగినప్పుడు  3గంటల 20నిమిషాలతో పాటు అదనంగా రెండు గంటల సమయం ఉంటుంది. 

ఇక ఫైనల్ రోజు గానీ రిజర్వ్ ఫైన్ డే రోజు గానీ సూపర్ ఓవర్ జరగడానికి ఉదయం1.20 వరకు అవకాశం ఉంటుంది.

► కాగా రిజర్వ్‌డే రోజునైనా కనీసం ఐదు ఓవర్లు ఆటకూడా ఆటసాధ్యం కాకపోతే పాయింట్ల పట్టికలో అగ్ర స్థానంలో ఉన్న జట్టును విజేతగా నిర్ణయిస్తారు

చదవండి: IPL 2022: తుఫాను దాటికి ఈడెన్‌ గార్డెన్స్ కుదేలు‌.. ప్లే ఆఫ్స్‌ ‍మ్యాచ్‌లేమో అక్కడే!

మీ అభిప్రాయం చెప్పండి

Loading...

Read latest Sports News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram

మరిన్ని వార్తలు

11-06-2022
Jun 11, 2022, 17:34 IST
ఐపీఎల్‌ 2022 సీజన్‌లో ముంబై ఇండియన్స్‌ ఘోర ప్రదర్శన చేసిన సంగతి తెలిసిందే. ఐపీఎల్‌ చరిత్రలో ఐదుసార్లు చాంపియన్‌గా నిలిచిన...
08-06-2022
Jun 08, 2022, 15:46 IST
India Vs South Africa 2022 T20 Series: టీమిండియాలో చోటు దక్కడం పట్ల కశ్మీర్‌ బౌలింగ్‌ సంచలనం ఉమ్రాన్‌...
05-06-2022
Jun 05, 2022, 08:42 IST
అర్జున్‌ టెండూల్కర్‌.. భారత దిగ్గజ క్రికెటర్‌ సచిన్‌ టెండూల్కర్‌ తనయుడు. తండ్రి పేరును తనలో జోడించుకొని అతని కంటే గొప్ప...
05-06-2022
Jun 05, 2022, 07:57 IST
ఆస్ట్రేలియన్‌ ఆల్‌రౌండర్‌ మిచెల్‌ మార్ష్‌ సంచలన వ్యాఖ్యలు చేశాడు. భారత్‌లో తనకు శాపం తగిలిందని.. ఇక్కడకు వచ్చిన ప్రతిసారి ఏదో కారణంగా...
04-06-2022
Jun 04, 2022, 12:11 IST
తాను ఎదుర్కొన్న అత్యంత కఠినమైన బ్యాటర్‌ గిల్‌ అన్న యశ్‌ దయాల్‌
03-06-2022
Jun 03, 2022, 21:16 IST
అరంగేట్ర సీజన్‌లోనే జట్టుకు టైటిల్‌ను అందించిన గుజరాత్‌ టైటాన్స్‌ కెప్టెన్‌ హార్ధిక్‌ పాండ్యాను ముంబై ఇండియన్స్ బౌలింగ్ కోచ్ షేన్...
03-06-2022
Jun 03, 2022, 20:12 IST
సచిన్ టెండూల్కర్ తనయుడు అర్జున్ టెండూల్కర్‌ గత రెండేళ్లుగా ఐపీఎల్‌ అరంగేట్రం కోసం ఎదురు చూస్తున్నాడు. ఐపీఎల్‌-2021 మినీ వేలంలో...
03-06-2022
Jun 03, 2022, 19:10 IST
ఐపీఎల్‌-2022లో సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌ తీవ్రంగా నిరాశ పరిచింది. మరోసారి లీగ్‌ దశలోనే ఎస్‌ఆర్‌హెచ్‌ ఇంటిముఖం పట్టింది. ఈ ఏడాది సీజన్‌లో...
03-06-2022
Jun 03, 2022, 18:19 IST
భారత జట్టు నుంచి నన్ను ఎవరూ తప్పించలేదు.. అసలు సెలక్షన్‌కు అందుబాటులో ఉంటేనే కదా!
03-06-2022
Jun 03, 2022, 16:38 IST
IPL 2022: ఒక్క మ్యాచ్‌ ఆడలేదు.. అయినా కోటికి పైగా వెనకేశారు! టైటిల్స్‌ కూడా!
03-06-2022
Jun 03, 2022, 14:12 IST
ఐపీఎల్ 2022 సీజన్ టైటిల్ గెలిచిన గుజరాత్ టైటాన్స్ కెప్టెన్‌ హార్దిక్‌ పాండ్యాను భారత మాజీ వికెట్ కీపర్ కిరణ్...
02-06-2022
Jun 02, 2022, 16:52 IST
నెహ్రాపై కిర్‌స్టన్‌ ప్రశంసల జల్లు
02-06-2022
Jun 02, 2022, 10:38 IST
ఐపీఎల్‌ 2022 సీజన్‌ కొందరు టీమిండియా ఆటగాళ్లకు పూర్వ వైభవం తీసుకొస్తే.. మరికొందరికి మాత్రం చేదు అనుభవం మిగిల్చింది. యజ్వేంద్ర...
01-06-2022
Jun 01, 2022, 16:40 IST
ఐపీఎల్‌ 2022 సీజన్‌ చాంపియన్స్‌గా గుజరాత్‌ టైటాన్స్‌ నిలిచిన సంగతి తెలిసిందే. హార్దిక్‌ పాండ్యా నేతృత్వంలోని జట్టు ఏ మాత్రం...
01-06-2022
Jun 01, 2022, 11:24 IST
IPL 2022: క్యాష్‌ రిచ్‌ లీగ్‌ ఐపీఎల్‌ అంటే క్రికెట్‌ ప్రేమికులకు ఎక్కడా లేని ఉత్సాహం. అభిమానులు ఫోర్లు, సిక్సర్ల...
31-05-2022
May 31, 2022, 17:18 IST
ఎస్‌ఆర్‌హెచ్‌ స్టార్‌ బౌలర్‌ ఉమ్రాన్‌ మాలిక్‌ ఐపీఎల్‌ 2022 సీజన్‌లో తన ప్రదర్శనతో ఆకట్టుకున్నాడు. ప్రతీ బంతిని గంటకు 150...
31-05-2022
May 31, 2022, 16:36 IST
ఐపీఎల్‌‌ 15వ సీజన్‌లో అత్యధిక పరుగులు చేసిన బ్యాటర్‌గా జాస్‌ బట్లర్‌ నిలిచాడు.17 మ్యాచ్‌ల్లో 863 పరుగులతో టాప్‌ స్కోరర్‌గా...
31-05-2022
May 31, 2022, 13:05 IST
టీమిండియా స్పిన్నర్‌ కరణ్‌ శర్మకు ఐపీఎల్‌లో అత్యంత అదృష్టవంతమైన ఆటగాడిగా పేరుంది. అతడు ఏ జట్టులో ఉంటే ఆ జట్టుదే టైటిల్‌...
31-05-2022
May 31, 2022, 10:48 IST
ఐపీఎల్‌ 15వ సీజన్‌ ఛాంపియన్స్‌గా హార్ధిక్‌ పాండ్యా సారథ్యంలోని గుజరాత్‌ టైటాన్స్‌ నిలిచిన సంగతి తెలిసిందే. అరంగేట్ర సీజన్‌లోనే టైటిల్‌ సాధించి...
31-05-2022
May 31, 2022, 08:37 IST
ఐపీఎల్‌-2022లో భాగమైన  పిచ్‌ క్యూరేటర్‌లు,గ్రౌండ్స్‌మెన్‌లకు బీసీసీఐ  భారీ నజరానా ప్రకటిచింది. ఈ ఏడాది టోర్నీ జరిగిన ఆరు వేదికలలో పనిచేసిన... 

Read also in:
Back to Top