IPL 2022: వర్షం పడితే కథేంటి.. ఫైనల్‌ చేరే దారులు ఎలా ఉన్నాయంటే!

Rain Likely Play SpoilSport Check Who Qualifies Game Gets Washed-out - Sakshi

ఐపీఎల్‌ 2022 సీజన్‌లో లీగ్‌ దశలో తొలి రెండు స్థానాల్లో నిలిచిన గుజరాత్‌ టైటాన్స్‌, రాజస్తాన్‌ రాయల్స్‌ మధ్య ఇవాళ(మే 24న) క్వాలిఫయర్‌-1 జరగనుంది. కోల్‌కతా వేదికగా జరగనున్న మ్యాచ్‌కు వర్షం ముప్పు పొంచి ఉంది. గత నాలుగు రోజులుగా కోల్‌కతా నగరంలో కుండపోత వర్షాలు కురుస్తున్నాయి.  మంగళవారం కూడా వర్షం పడే చాన్స్‌ ఉండడంతో మ్యాచ్‌ జరగడంపై నీలినీడలు కమ్ముకున్నాయి. మ్యాచ్‌ జరగనున్న ఈడెన్‌ గార్డెన్స్‌లో ఆధునాతన డ్రైనేజీ సౌకర్యం ఉన్నప్పటికి.. మ్యాచ్‌ సమయంలో ఉరుములు, మెరుపులతో కూడిన వర్షం పడితే ఏం చేయలేని పరిస్థితి.

ప్రస్తుతం పరిస్థితి బాగానే ఉన్నప్పటికి సాయంత్రం వర్షం పడే అవకాశాలు 65 శాతం ఉన్నాయని.. మ్యాచ్‌ ప్రారంభమయ్యే సమయానికి రెండు గంటల పాటు కుండపోత వర్షం పడే చాన్స్‌ ఉందని వాతావరణశాఖ అంచనా వేసింది. ఇదే నిజమైతే అవుట్‌ ఫీల్డ్‌ చిత్తడిగా మారి మ్యాచ్‌ నిర్వహణ కష్టంగా మారుతుంది. సమయం లేకపోవడంతో క్వాలిఫయర్‌-1కు  రిజర్వ్‌ డే కూడా కేటాయించలేదు. దీంతో మ్యాచ్‌ రద్దు అయితే ఫైనల్‌ ఎవరు వెళతారు అనేది ఆసక్తికరంగా మారింది. వర్షం ముప్పుతో ఆటకు అంతరాయం ఏర్పడితే మ్యాచ్‌ ఎలా నిర్వహిస్తారు.. ఎవరికి ఫైనల్‌ అవకాశాలు ఉంటాయి అనేది పరిశీలిద్దాం.

ఐపీఎల్‌ నిబంధనల ప్రకారం.. ప్లే ఆఫ్‌ మ్యాచ్‌కు వర్షం అంతరాయం కలిగిస్తే.. ఏ జట్టు ఫైనల్‌కు వెళ్లాలనే దానిపై మూడు దారులు ఉన్నాయి.
►మొదటిది.. ఇరుజట్ల మధ్య ఐదు ఓవర్ల మ్యాచ్‌ నిర్వహించడం. ఈ మ్యాచ్‌లో ఎవరు గెలిస్తే వారు ఫైనల్‌కు చేరుకుంటారు. ఓడిన జట్టు క్వాలిఫయర్‌-2 మ్యాచ్‌ ద్వారా మరో చాన్స్‌ ఉంటుంది.
►రెండోది.. మ్యాచ్‌ ప్రారంభం నుంచి చివరి వరకు ఎడతెరిపి లేకుండా వర్షం కురిసి.. ఆ తర్వాత మ్యాచ్‌కు అవకాశం ఉంటే సూపర్‌ ఓవర్‌ ద్వారా విజేతను తేలుస్తారు. 
►భారీ వర్షం వల్ల సూపర్‌ ఓవర్‌ కూడా సాధ్యపడకపోతే లీగ్‌లో అత్యధిక విజయాలు సాధించి గ్రూఫ్‌ టాపర్‌గా నిలిచిన జట్టు ఫైనల్‌కు వెళుతుంది. ఇదే జరిగితే గుజరాత్‌ టైటాన్స్‌ ఫైనల్‌కు.. రాజస్తాన్‌ రాయల్స్‌ క్వాలిఫయర్‌-2కు సిద్ధమవుతుంది.
►ఇక ఎలిమినేటర్‌ మ్యాచ్‌లోనూ వర్షం అంతరాయం కలిగిస్తే ఇదే పద్దతిని అనుసరిస్తారు. కాకపోతే ఇక్కడ గెలిచిన జట్టు క్వాలిఫయర్‌-2కు అర్హత సాధిస్తే.. ఓడిన జట్టు ఇంటిబాట పడుతుంది. వర్షం వల్ల సూపర్‌ ఓవర్‌ సాధ్యపడకపోతే..  మూడో స్థానంలో ప్లేఆఫ్‌కు చేరిన లక్నో సూపర్‌ జెయింట్స్‌ క్వాలిఫయర్‌-2కు అర్హత సాధిస్తుంది.

చదవండి: IND Vs SA T20 Series: ధావన్‌ ఎంపికలో అన్యాయం.. కేఎల్‌ రాహుల్‌ జోక్యంలో నిజమెంత?

IPL 2022: ప్లేఆఫ్స్‌లో మాత్రం ఖచ్చితంగా రాణిస్తాను: జోస్‌ బట్లర్‌

Read latest Sports News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top