IND Vs SA T20 Series: ధావన్‌ ఎంపికలో అన్యాయం.. కేఎల్‌ రాహుల్‌ జోక్యంలో నిజమెంత?

Reports Shikhar Dhawan Informed-by Coach Rahul Dravid Before Omission - Sakshi

టీమిండియా వెటరన్‌ ఆటగాడు శిఖర్‌ ధావన్‌కు టీమిండియా సెలక్టర్లు మరోసారి మొండిచేయి చూపారు. సూపర్‌ ఫామ్‌లో ఉన్న ధావన్‌ను సౌతాఫ్రికాతో టి20 సిరీస్‌కు ఎంపిక చేయకపోవడం క్రికెట్‌ ఫ్యాన్స్‌ను ఆశ్చర్యపరిచింది. యువ ఆటగాళ్లకు చాన్స్‌ ఇవ్వాలనే ఉద్దేశంతోనే ధావన్‌కు రెస్ట్‌ ఇచ్చామని బీసీసీఐ చెప్పిన కారణంపై విమర్శలు వస్తున్నాయి. ఎంత యువ జట్టైనా ఒక సీనియర్‌ ఆటగాడు ఉంటే అతని అనుభవం జట్టుకు పనికి వస్తుందని చాలా మంది అభిఫ్రాయపడ్డారు.

అయితే షాకింగ్‌ న్యూస్‌ ఏంటంటే.. ధావన్‌కు చెప్పి మరీ జట్టు నుంచి పక్కనబెట్టినట్లు తెలిసింది. టీమిండియా హెడ్‌కోచ్‌ రాహుల్‌ ద్రవిడ్‌ స్వయంగా ధావన్‌తో మాట్లాడినట్లు తేలింది. రానున్న టి20 ప్రపంచకప్‌ 2022 దృష్టిలో పెట్టుకొని యంగస్టర్స్‌కు అవకాశం ఇవ్వాలని నిర్ణయించినట్లు తెలిసింది. అందుకు ధావన్‌ మొదట ఒప్పుకోకపోయినప్పటికి.. ద్రవిడ్‌ రంగ ప్రవేశంతో చివరికి ధావన్‌ అంగీకరించినట్లు వార్తలు వస్తున్నాయి.

ఇదే నిజమైతే ధావన్‌కు అన్యాయం జరిగినట్లేనని క్రికెట్‌ ఫ్యాన్స్‌ కామెంట్స్‌ చేశారు. ఇంకో విషయమేంటంటే.. ప్రొటీస్‌తో టి20 సిరీస్‌కు కేఎల్‌ రాహుల్‌ కెప్టెన్‌గా ఉన్న సంగతి తెలిసిందే. రాహుల్‌  జట్టు మొత్తం యువ ఆటగాళ్లతో నిండిపోవాలని కోరుకున్నాడని.. అందుకే జట్టు ఎంపికకు ముందే కోచ్‌ ద్రవిడ్‌ ద్వారా ధావన్‌కు విషయాన్ని చేరవేశామని బీసీసీఐ అధికారి ఒకరు తెలిపారు. 

ఇక ఐపీఎల్‌ 2022 సీజన్‌లో కింగ్స్‌ పంజాబ్‌ జట్టు ప్లే ఆఫ్‌ చేరడంలో విఫలమైంది. ఆడిన 14 మ్యాచ్‌ల్లో ఏడు విజయాలు, ఏడు ఓటములతో పాయింట్ల పట్టికలో ఆరో స్థానంలో నిలిచింది. అయితే ఆ జట్టు స్టార్‌ ఓపెనర్‌ శిఖర్‌ ధావన్‌ మాత్రం సూపర్‌ సక్సెస్‌ అయ్యాడు. 14 మ్యాచ్‌ల్లో మూడు అర్థశతకాలతో 460 పరుగులు సాధించాడు. బట్లర్‌, కేఎల్‌ రాహుల్‌, డికాక్‌ తర్వాతి స్థానం శిఖర్‌ ధావన్‌దే కావడం విశేషం.​

చదవండి: Cheteshwar Pujara On IPL 2022: 'ఐపీఎల్‌లో ఆడకపోవడం మంచిదైంది.. అందుకే మళ్లీ తిరిగి వచ్చా'

IND Vs SA T20: డీకేను సెలక్ట్‌ చేసినపుడు ధావన్‌ను ఎందుకు పక్కనపెట్టారు: టీమిండియా మాజీ ఆటగాడు

Read latest Sports News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram

మరిన్ని వార్తలు

24-05-2022
May 24, 2022, 13:03 IST
ఐపీఎల్‌ 2022 సీజన్‌లో ఇవాళ (మే 24) తొలి క్వాలిఫయర్ మ్యాచ్‌ జరుగనుంది. కోల్‌కతాలోని ఈడెన్‌ గార్డెన్స్‌ వేదికగా జరిగే...
24-05-2022
May 24, 2022, 12:14 IST
ఐపీఎల్‌ 2022 సీజన్‌లో లీగ్‌ దశలో తొలి రెండు స్థానాల్లో నిలిచిన గుజరాత్‌ టైటాన్స్‌, రాజస్తాన్‌ రాయల్స్‌ మధ్య ఇవాళ(మే...
24-05-2022
May 24, 2022, 11:48 IST
AB De Villiers To Reunite With RCB: తన ఐపీఎల్‌ రీ ఎంట్రీపై గత కొద్ది రోజులుగా జరుగుతున్న...
24-05-2022
May 24, 2022, 07:19 IST
కోల్‌కతా: ఈ ఏడాదే ఐపీఎల్‌లో ప్రవేశించిన గుజరాత్‌ టైటాన్స్‌ ఇప్పుడు ఫైనల్లో అడుగు పెట్టేందుకు తహతహలాడుతోంది. ఇప్పటిదాకా ఈ టోర్నీలో...
23-05-2022
May 23, 2022, 21:46 IST
ఐపీఎల్‌-2022 ఫస్ట్‌ హాఫ్‌లో రాజస్తాన్‌ రాయల్స్‌ ఆటగాడు జోస్‌ బట్లర్‌ దుమ్మురేపాడు. ఫస్ట్‌ హాఫ్‌లో అతడు మూడు సెంచరీలు నమోదు...
23-05-2022
May 23, 2022, 18:19 IST
టీమిండియా లీడింగ్‌ ఆల్‌రౌండర్‌ అవుతాడు.. ఎస్‌ఆర్‌హెచ్‌ స్టార్‌పై రవిశాస్త్రి ప్రశంసలు
23-05-2022
May 23, 2022, 17:06 IST
ఐపీఎల్‌-2022 తుది దశకు చేరుకుంది. ఇప్పటికే లీగ్‌ మ్యాచ్‌లు ముగియగా.. ప్లే ఆఫ్స్‌కు ఆయా జట్లు సిద్దమవుతున్నాయి. ఇక కోల్‌కతాలోని...
23-05-2022
May 23, 2022, 16:02 IST
IPL 2022: ఐపీఎల్‌-2022 ముగింపు దశకు చేరుకుంటోంది. ఇప్పటికే లీగ్‌ దశ ముగియగా.. మే 24న తొలి క్వాలిఫైయర్‌-1 జరుగనుంది....
23-05-2022
May 23, 2022, 13:31 IST
క్యాష్‌ రిచ్‌ లీగ్‌ చరిత్రలో ఐపీఎల్‌ 2022 సీజన్‌ ప్రత్యేక గుర్తింపు దక్కించుకుంది. సింగిల్‌ సీజన్‌లో అత్యధిక సిక్సర్ల రికార్డును...
23-05-2022
May 23, 2022, 11:38 IST
ముంబై ఇండియన్స్‌తో జరిగిన కీలక సమరంలో ఓడి, ప్లే ఆఫ్స్‌కు చేరే అవకాశాన్ని చేజేతులా జారవిడుచుకున్న ఢిల్లీ క్యాపిటల్స్‌పై టీమిండియా...
23-05-2022
May 23, 2022, 09:47 IST
తొలి క్వాలిఫయర్‌ మ్యాచ్‌ ఆడేందుకు కోల్‌కతా బయల్దేరిన రాజస్థాన్ రాయల్స్ బృందానికి చేదు అనుభవం ఎదురైంది. నిన్న (మే 22)...
23-05-2022
May 23, 2022, 07:15 IST
ముంబై: ఎనిమిది జట్లు పాల్గొన్న గత ఐపీఎల్‌లో సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌కు ఎనిమిదో స్థానం... పది జట్లు పాల్గొన్న ఈసారి ఐపీఎల్‌లోనూ...
22-05-2022
May 22, 2022, 19:07 IST
ఐపీఎల్‌-2022 అఖరి లీగ్‌ మ్యాచ్‌లో సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌పై పంజాబ్‌ కింగ్స్‌ ఐదు వికెట్లు తేడాతో ఘన విజయం సాధించింది. 158...
22-05-2022
May 22, 2022, 16:57 IST
ఐపీఎల్‌-2022 సీజన్‌ ఆరంభంలో అద్భుతంగా రాణించిన సన్‌ రైజర్స్‌ హైదరాబాద్‌ స్టార్‌ పేసర్‌ టి. నటరాజన్‌.. టోర్నీ సెకెండ్‌ హాఫ్‌లో...
22-05-2022
May 22, 2022, 16:51 IST
ఐపీఎల్‌ 2022 సీజన్‌లో ఇతర జట్ల జయాపజాలపై ఆధారపడి అతికష్టం మీద ప్లే ఆఫ్స్‌కు అర్హత సాధించిన ఆర్సీబీ ఓ...
22-05-2022
May 22, 2022, 16:02 IST
సుడిగాలి ఇన్నింగ్స్‌తో ఢిల్లీ పుట్టి ముంచి, ఆర్సీబీని ప్లే ఆఫ్స్‌కు చేర్చిన ముంబై హార్డ్‌ హిట్టర్‌ టిమ్‌ డేవిడ్‌పై ఆర్సీబీ...
22-05-2022
May 22, 2022, 15:22 IST
ఐపీఎల్ 2022 సీజన్‌ ఇవాళ (మే 22) చిట్టచివరి లీగ్‌ మ్యాచ్‌ జరుగనుంది. ముంబైలోని వాంఖడే వేదికగా సన్‌రైజర్స్‌, పంజాబ్‌...
22-05-2022
May 22, 2022, 13:57 IST
ఐపీఎల్‌ 2022 సీజన్‌ ముంబై ఇండియన్స్‌ కెప్టెన్‌ రోహిత్‌ శర్మకు చేదు అనుభవాల్ని మిగిల్చింది. ఐపీఎల్‌ చరిత్రలో గతంలో ఎన్నడూ...
22-05-2022
May 22, 2022, 13:28 IST
 శ్రేయస్‌ నుంచి పగ్గాలు చేపట్టాడు.. ఢిల్లీ కెప్టెన్‌గా పంత్‌ కరెక్ట్‌: పాంటింగ్‌
22-05-2022
May 22, 2022, 13:19 IST
ఐపీఎల్ 2022 సీజన్‌ చిట్టచివరి లీగ్‌ మ్యాచ్‌లో ఇవాళ (మే 22) సన్‌రైజర్స్‌, పంజాబ్‌ కింగ్స్‌ జట్లు తలపడనున్నాయి. ముంబైలోని... 

Read also in:
Back to Top