IPL 2022: ప్లే ఆఫ్స్, ఫైనల్ వేదికలు ఖరారు..

ఐపీఎల్ 15వ సీజన్ రసవత్తరంగా మారింది. ఇప్పటికే సీజన్‌లో 35 మ్యాచ్‌లు పూర్తవ్వగా.. మరో 35 లీగ్ మ్యాచ్‌లు మిగిలి ఉన్నాయి. ఈ నేపథ్యంలో బీసీసీఐ ఆదివారం ప్లే ఆఫ్స్, ఫైనల్ మ్యాచ్ జరగబోయే వేదికలను ఖరారు చేసింది. మే 24, 26 తేదీల్లో జరగనున్న క్వాలిఫయర్ 1, ఎలిమినేటర్ మ్యాచ్‌లకు కోల్‌కతా ఆతిథ్యమివ్వనుండగా.. మే 27న జరగనున్న క్వాలిఫయర్ 2తో పాటు.. మే 29న జరగనున్న ఫైనల్ మ్యాచ్‌కు అహ్మదాబాద్ వేదిక కానుంది.
ఈ మేరకు బీసీసీఐ అపెక్స్ కౌన్సిల్ నిర్ణయం తీసుకుందని అధ్యక్షుడు గంగూలీ ఒక ప్రకటనలో తెలిపారు. ప్లే ఆఫ్స్, ఫైనల్ మ్యాచ్‌కు వంద శాతం ప్రేక్షకులను అనుమతి ఇస్తున్నట్లు తెలిపింది. మే 22 వరకు జరగనున్న లీగ్ మ్యాచ్‌లకు ముందుగా నిర్ణయించినట్లుగానే 50శాతం ప్రేక్షకులకు మాత్రమే అనుమతి ఉంది. ఇక మహిళల టి20 చాలెంజర్స్‌పై కూడా బీసీసీఐ కీలక నిర్ణయం తీసుకుంది. మే 24-28 మధ్య లక్నో వేదికగా మూడు జట్లతో మహిళల టి20 చాలెంజర్స్ టోర్నీ నిర్వహించనుంది.
ఇక ఇప్పటివరకు ఐపీఎల్ 2022లో 35 మ్యాచ్‌లు జరగ్గా.. మరో 35 లీగ్ మ్యాచ్‌లు జరగాల్సి ఉంది. పాయింట్ల పట్టికలో గుజరాత్ టైటాన్స్, ఎస్‌ఆర్‌హెచ్, రాజస్తాన్ రాయల్స్, ఆర్‌సీబీ తొలి నాలుగు స్థానాల్లో నిలవగా.. లక్నో, ఢిల్లీ క్యాపిటల్స్ ఐదు, ఆరు.. కేకేఆర్, పంజాబ్.. ఏడు, ఎనిమిది స్థానాల్లో ఉన్నాయి. ఇక ముంబై ఈ సీజన్‌లో ఇప్పటివరకు ఏడు మ్యాచ్‌లాడి ఒక్కదాంట్లోనూ విజయం సాధించలేక ఆఖరి స్థానానికి పరిమితం కాగా.. గతేడాది చాంపియన్ సీఎస్‌కే తొమ్మిదో స్థానంలో ఉంది. మరో 35 మ్యాచ్‌లు మిగిలిఉన్న నేపథ్యంలో తొలి నాలుగు స్థానాల్లో ఏమైనా మార్పులు ఉండే అవకాశం ఉంది.
చదవండి: IPL 2022: ఏప్రిల్ 23.. ఆర్‌సీబీకి కలిసిరాని రోజు
Kohli Golden Duck: మేము చూస్తున్నది కోహ్లిని కాదు.. ఇంకెవరో!
మరిన్ని వార్తలు