IPL 2022: ఏప్రిల్‌ 23.. ఆర్‌సీబీకి కలిసిరాని రోజు

IPL 2022: April 23 Brings Bad-Luck For RCB Suffer Batting Collapse Again - Sakshi

ఏప్రిల్‌ 23.. ఐపీఎల్‌ చరిత్రలో ఆర్‌సీబీకి కలిసిరాని రోజుగా మిగిలిపోనుంది. ఐదేళ్ల క్రితం 2017 ఏప్రిల్‌ 23న రాయల్‌ చాలెంజర్స్‌ బెంగళూరు (ఆర్‌సీబీ) ఐపీఎల్‌ చరిత్రలోనే అత్యల్ప స్కోరు (49)ను నమోదు చేసింది. అప్పుడు కేకేఆర్‌ ఇచ్చిన 131 పరుగుల లక్ష్యాన్ని అందుకోవడంలో విఫలమైన ఆర్‌సీబీ టోర్నీ చరిత్రలోనే అత్యల్పో స్కోరు చేసింది. ఇప్పుడు సరిగ్గా అదే రోజు దాదాపు అదే ప్రదర్శనను కనబరుస్తూ తమ రెండో అత్యల్ప స్కోరు సాధించింది. సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌ బౌలర్లు ఒకరితో మరొకరు పోటీ పడి ఆర్‌సీబీని 68 పరుగులకే కుప్పకూల్చారు.

అదే ఏప్రిల్‌ 23.. 
కానీ ఇదే ఏప్రిల్‌ 23న.. ఆర్‌సీబీకి  మంచి రికార్డు ఉంది. 2013లో పుణే వారియర్స్‌పై గేల్‌ సునామీ ఇన్నింగ్స్‌ ఆడడంతో ఐపీఎల్‌ చరిత్రలో ఆర్‌సీబీ 263 పరుగుల అత్యధిక స్కోరు సాధించింది. ఇప్పటికి ఈ రికార్డు చెక్కుచెదరకుండా ఉంది. యునివర్సల్‌ బాస్‌ ఆ మ్యాచ్‌లో 17 సిక్సర్లు, 13 ఫోర్లతో విధ్వంసకర ఇన్నింగ్స్‌ ఆడి 175 పరుగులు నాటౌట్‌గా నిలిచాడు. ఈ మ్యాచ్‌లో ఆర్‌సీబీ 131 పరుగుల తేడాతో భారీ విజయం అందుకుంది. అలా ఒక మంచి రికార్డు ఉన్నప్పటికి.. రెండుసార్లు ఇదే తేదీన అత్యల్ప స్కోర్లు నమోదు చేసిన ఆర్‌సీబీకి ఒక రకంగా పీడకలగా మిగిలిపోనుంది.

ఒకే తేదీన అటు అత్యల్ప స్కోరు.. ఇటు అత్యధిక స్కోరు చేసిన అరుదైన జట్టుగా ఆర్సీబీ నిలిచింది. అయితే ఆర్‌సీబీ ప్రదర్శనపై క్రికెట్‌ ఫ్యాన్స్‌ సోషల్‌మీడియాలో ఒక ఆట ఆడుకున్నారు. ''దయచేసి ఏప్రిల్‌ 23న ఆర్‌సీబీకి మ్యాచ్‌ పెట్టకండి.. ఏప్రిల్‌ 23తో ఆర్‌సీబీకి విడదీయరాని బంధం ఏర్పడింది.. ఒకే తేదీన అత్యల్ప స్కోరు.. అత్యధిక స్కోరు.. ఇది ఆర్‌సీబీకి మాత్రమే సాధ్యం'' అంటూ కామెంట్స్‌ చేశారు.

చదవండి: IPL 2022: ఎదురులేని ఎస్‌ఆర్‌హెచ్‌.. ఐపీఎల్‌ చరిత్రలో అరుదైన రికార్డు

IPL 2022: తొలి బంతికే డ‌కౌట్‌..కోహ్లికి ఏమైంది.. త‌ల‌దించుకుని పెవిలియ‌న్‌కు!

Read latest Sports News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top