
ఐపీఎల్-2022లో విరాట్ కోహ్లి మరోసారి నిరాశపరిచాడు. సన్‌రైజర్స్ హైదరాబాద్‌తో మ్యాచ్‌లో కోహ్లి గోల్డన్ డక్‌గా వెనుదిరిగాడు. ఓపెనర్ డుప్లెసిస్ అవుటైన తర్వాత క్రీజులోకి వచ్చిన విరాట్ కోహ్లి.. జానెసన్ వేసిన బంతిని షాట్ ఆడే ప్రయత్నం చేశాడు. ఈ క్రమంలో బంతి ఎడ్జ్ తీసుకుని నేరుగా సెకెండ్ స్లిప్‌లో ఉన్న మాక్రమ్ చేతికి వెళ్లింది.
దీంతో తొలి బంతికే ఔటయ్యన కోహ్లి ఒక్క సారిగా దిగులుగా అలానే చూస్తుండు పోయాడు. ఇక కోహ్లి రియాక్షన్‌కు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఇక ఈ సీజన్‌లో కోహ్లికి వరుసగా రెండో గోల్డన్ డక్. ఓవరాల్‌గా తన ఐపీఎల్ కెరీర్‌లో కోహ్లికి ఇది ఐదో గోల్డన్ డక్. ఇక ఐపీఎల్ 2022లో ఇప్పటి వరకు 8 మ్యాచ్‌లు ఆడిన విరాట్ కోహ్లి కేవలం 119 పరుగులు మాత్రమే చేశాడు.
— Diving Slip (@SlipDiving) April 23, 2022
చదవండి: IPL 2022: 11 ఏళ్ల రికార్డును బద్దలు కొట్టిన జోస్ బట్లర్.. తొలి ఆటగాడిగా!