Australian Open: పోరాడి ఓడిన సుమిత్‌ నగాల్‌  | Sumit Nagal Run In Australian Open Ends In Second Round | Sakshi
Sakshi News home page

Australian Open: పోరాడి ఓడిన సుమిత్‌ నగాల్‌ 

Jan 19 2024 7:20 AM | Updated on Jan 19 2024 7:20 AM

Sumit Nagal Run In Australian Open Ends In Second Round - Sakshi

ఆస్ట్రేలియన్‌ ఓపెన్‌లో భారత నంబర్‌వన్‌ సుమిత్‌ నగాల్‌ పోరాటం రెండో రౌండ్‌లోనే ముగిసింది. క్వాలిఫయర్‌ హోదాలో మెయిన్‌ ‘డ్రా’లో అడుగు పెట్టిన ప్రపంచ 137వ ర్యాంకర్‌ సుమిత్‌ నగాల్‌ గురువారం జరిగిన రెండో రౌండ్‌లో 6–2, 3–6, 5–7, 4–6తో ప్రపంచ 140వ ర్యాంకర్‌ జున్‌చెంగ్‌ షాంగ్‌ (చైనా) చేతిలో ఓడిపోయాడు. 2 గంటల 50 నిమిషాలపాటు జరిగిన ఈ మ్యాచ్‌లో సుమిత్‌ 22 అనవసర తప్పిదాలు చేశాడు.

రెండో రౌండ్‌లో ఓడిన సుమిత్‌ నగాల్‌కు ఓవరాల్‌గా 2,45,000 ఆ్రస్టేలియన్‌ డాలర్లు (రూ. 1 కోటీ 33 లక్షలు) ప్రైజ్‌మనీగా లభించాయి. పురుషుల డబుల్స్‌ తొలి రౌండ్‌లో రోహన్‌ బోపన్న (భారత్‌) –ఎబ్డెన్‌ (ఆ్రస్టేలియా) జోడీ 7–6 (7/5), 4–6, 7–6 (10/2)తో డక్‌వర్త్‌–పాల్మన్స్‌ (ఆ్రస్టేలియా) జంటపై గెలిచింది. అనిరుధ్‌–విజయ్‌ ప్రశాంత్‌ (భారత్‌) ద్వయం 3–6, 4–6తో మరోజ్‌సన్‌–ఫుచోవిక్స్‌ (హంగేరి) జోడీ చేతిలో ఓడింది.  

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement