BAN vs SL: శ్రీలంక జట్టు ప్రకటన.. స్టార్‌ ఆటగాడు రీ ఎంట్రీ | Sakshi
Sakshi News home page

BAN vs SL: శ్రీలంక జట్టు ప్రకటన.. స్టార్‌ ఆటగాడు రీ ఎంట్రీ

Published Tue, Mar 12 2024 6:52 PM

Sri Lanka announce ODI squad for Bangladesh series - Sakshi

బంగ్లాదేశ్‌తో వన్డే సిరీస్‌కు 16 మంది సభ్యులతో కూడిన తమ జట్టును శ్రీలంక క్రికెట్‌ మంగళవారం ప్రకటించింది. గాయం కారణంగా గత కొంత కాలంగా జట్టుకు దూరంగా ఉన్న వెటరన్‌ పేసర్‌ లాహిరు కుమార పునరాగమనం చేసేందుకు సిద్దమయ్యాడు. 

ఈ జట్టులో కుమారకు చోటు దక్కింది. అతడితో పాటు బంగ్లాతో టీ20 సిరీస్‌లో అకట్టుకున్న కమిందు మెండిస్‌కు వన్డే జట్టులో కూడా చోటు దక్కింది. అదే విధంగా ఆల్‌రౌండర్‌ చమికా కరుణరత్నేకు ఛాన్నాళ్ల తర్వాత సెలక్టర్లు మళ్లీ పిలుపునిచ్చారు. 

ఇక వన్డే సిరీస్‌కు సైతం స్టార్‌ పేసర్‌ దుష్మంత చమీర గాయం కారణంగా దూరమయ్యాడు. అయితే బంగ్లాదేశ్‌తో ఆఖరి టీ20లో ఐదు వికెట్లతో చెలరేగిన నువాన్‌ తుషారాకు వన్డే జట్టులో చోటు దక్కకపోవడం​ గమనార్హం. మార్చి 13 నుంచి ఛటోగ్రామ్‌ వేదికగా ఈ వన్డే సిరీస్‌ ప్రారంభం కానుంది. కాగా బంగ్లాతో టీ20 సిరీస్‌ను 2-1తో లంక సొంతం చేసుకుంది.

శ్రీలంక జట్టు: కుసాల్ మెండిస్ (కెప్టెన్‌), పాతుమ్ నిస్సాంక, అవిష్క ఫెర్నాండో, సదీర సమరవిక్రమ, చరిత్ అసలంక, జనిత్ లియానగే, వనిందు హసరంగా, దునిత్ వెల్లలగే, ప్రమోద్ మధుషన్, లహిరు కుమార, మహేశ్ తీక్షణ, కమిన్నన్‌ల దస్సన, దిల్షన్ మదుషాన, దిల్షాన్ మదుషాన , సహన్ అరాచ్చిగే, చమిక కరుణరత్నే.

Advertisement
 
Advertisement
 
Advertisement