ఓపెనర్లే కొట్టేశారు.. వరల్డ్‌కప్‌లో దక్షిణాఫ్రికా బోణీ | South Africa Crush West Indies By 10 Wickets | Sakshi
Sakshi News home page

T20 WC 2024: ఓపెనర్లే కొట్టేశారు.. వరల్డ్‌కప్‌లో దక్షిణాఫ్రికా బోణీ

Oct 4 2024 7:08 PM | Updated on Oct 4 2024 7:43 PM

South Africa Crush West Indies By 10 Wickets

మహిళల టీ20 వరల్డ్‌కప్‌-2024లో దక్షిణాఫ్రికా శుభారంభం చేసింది. ఈ టోర్నీలో భాగంగా శుక్రవారం వెస్టిండీస్‌ మహిళల జట్టుతో జరిగిన మ్యాచ్‌లో 10 వికెట్ల తేడాతో సౌతాఫ్రికా ఘన విజయం సాధించింది. 119 పరుగుల స్వల్ప లక్ష్యాన్ని దక్షిణాఫ్రికా ఓపెనర్లు లారా వోల్వార్డ్ట్, టాంజిబ్‌ బ్రిట్స్‌ ఊదిపడేశారు.

వోల్వార్ట్‌​ 55 బంతుల్లో 59 పరుగులు చేయగా.. బ్రిట్స్‌ 52 బంతుల్లో 57 పరుగులు చేసింది. విండీస్‌ బౌలర్లలో ఎనిమిది బౌలింగ్‌ చేసినప్పటకి ఏ ఒక్కరూ ఒక్క వికెట్‌ కూడా సాధించలేకపోయారు. అంతకుముందు బ్యాటింగ్‌ చేసిన విండీస్‌.. ప్రోటీస్‌ బౌలర్లు కట్టుదిట్టంగా బౌలింగ్‌ చేయడంతో 118 పరుగులకే పరిమితమైంది.

సౌతాఫ్రికా స్పిన్నర్‌ మల్బా 4 వికెట్లతో చెలరేగింది. ఆమెతో పాటు కాప్‌ రెండు వికెట్లు సాధించింది. విండీస్‌ బ్యాటర్లలో టేలర్‌(44 నాటౌట్‌) టాప్‌ స్కోరర్‌గా నిలిచింది. ఇక దక్షిణాఫ్రికా తమ తర్వాతి మ్యాచ్‌లో ఆక్టోబర్‌ 7న ఇంగ్లండ్‌తో తలపడనుంది. అదే విధంగా విం‍డీస్‌ తమ తదుపరి మ్యాచ్‌లో ఆక్టోబర్‌ 6న స్కాట్లాండ్‌ను ఢీకొట్టనుంది.
చదవండి: పాక్ కెప్టెన్‌గా ఎవ‌రూ ఊహించ‌ని ప్లేయ‌ర్‌?

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement