
Photo: IPL Twitter
ఐపీఎల్ 16వ సీజన్‌లో ఢిల్లీ క్యాపిటల్స్ ఎట్టకేలకు తొలి విజయాన్ని నమోదు చేసింది. గురువారం కేకేఆర్‌తో మ్యాచ్‌లో 128 పరుగుల లక్ష్యాన్ని కిందా మీదా పడి ఎలాగోలా చేధించింది. ఒక దశలో కేకేఆర్ మ్యాచ్ విజయం సాధిస్తుందా అన్న అనుమానం కూడా వచ్చింది. కానీ చివరి వరకు నిలబడిన అక్షర్ పటేల్ జట్టును గెలిపించాడు. అయితే కొందరు మాత్రం ఢిల్లీ విజయాన్ని బాలీవుడ నటి ఊర్వశి రౌతేలా క్రెడిట్‌లో వేయడం ఆసక్తి కలిగించింది.
ఇక ఢిల్లీ క్యాపిటల్స్, కేకేఆర్ మ్యాచ్‌లో బాలీవుడ నటి ఊర్వశి రౌతేలా ప్రత్యేక ఆకర్షణగా నిలచింది. పసుపు కలర్ మిడ్డీలో వచ్చిన ఆమె తన అందంతో ప్రేక్షకులను కట్టిపడేసిందనే చెప్పొచ్చు. ఊర్వశి రౌతేలా ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి.
అయితే ఢిల్లీ క్యాపిటల్స్ విజయాన్ని ఆమెతో ముడిపెట్టడం ఏంటని కొందరు అభిమానులు పేర్కొన్నారు. ''ఆమెదో మ్యాచ్ చూడడానికి వచ్చింది. అలా అని ఢిల్లీ క్యాపిటల్స్ విజయానికి కారణం ఊర్వశి అనడం కరెక్ట్ కాదు.. ఇది వినడానికే విడ్డూరంగా ఉంది.. ఇంకెంతకాలం ఊర్వశి రౌతేలా జపం చేస్తారు..'' అని కామెంట్ చేశారు.
Reason of Delhi Capitals performance Today 🔥
— K L Rahul (@klrahul___) April 20, 2023
Urvashi Rautela🥵 pic.twitter.com/D0ggfAMuvw