రన్నరప్‌ సిక్కి రెడ్డి జోడీ | Sakshi
Sakshi News home page

రన్నరప్‌ సిక్కి రెడ్డి జోడీ

Published Mon, May 22 2023 11:33 AM

Slovenia Open: Sikki Reddy Rohan Kapoor Won Silver Medal - Sakshi

Sikki Reddy: స్లొవేనియా ఓపెన్‌ ఇంటర్నేషనల్‌ చాలెంజ్‌ బ్యాడ్మింటన్‌ టోర్నీ మిక్స్‌డ్‌ డబుల్స్‌ విభాగంలో తెలంగాణ అమ్మాయి సిక్కి రెడ్డి రన్నరప్‌గా నిలిచింది. ఆదివారం జరిగిన ఫైనల్లో టాప్‌ సీడ్‌ సిక్కి రెడ్డి–రోహన్‌ కపూర్‌ (భారత్‌) జోడీ 12–21, 13–21తో మూడో సీడ్‌ జెస్పర్‌ టాఫ్ట్‌–క్లారా గావర్సన్‌ (డెన్మార్క్‌) ద్వయం చేతిలో ఓడిపోయింది. సెమీఫైనల్లో సిక్కి–రోహన్‌ 21–15, 21–19తో మాడ్స్‌ వెస్టర్‌గార్డ్‌–క్రిస్టిన్‌ బుష్‌ (డెన్మార్క్‌)లపై గెలిచారు.   

ఇది కూడా చదవండి: ‘డ్రా’తో గట్టెక్కిన భారత్‌ 
అడిలైడ్‌: ఆస్ట్రేలియా మహిళల జట్టుతో మూడు మ్యాచ్‌ల సిరీస్‌ ను భారత జట్టు ‘డ్రా’తో ముగించింది. తొలి రెండు మ్యాచ్‌ల్లో ఓడిపోయి సిరీస్‌ను కోల్పోయిన భార త్‌ ఆదివారం జరిగిన మూడో మ్యాచ్‌ను 1–1తో ‘డ్రా’ చేసుకుంది. మాడిసన్‌ బ్రూక్స్‌ (25వ ని. లో) చేసిన గోల్‌తో ఆస్ట్రేలియా 1–0తో ఆధిక్యంలోకి వెళ్లగా...    దీప్‌ గ్రేస్‌ ఎక్కా (42వ ని.లో) గోల్‌తో భారత్‌ స్కోరును సమంచేసింది. ఈ మ్యాచ్‌తో భారత కెప్టెన్‌ సవితా పూనియా, డిఫెండర్‌ నిక్కీ ప్రధాన్‌ తమ కెరీర్‌లో 250 మ్యాచ్‌లు పూర్తి చేసుకున్నారు.

Advertisement
 
Advertisement