బ్రాడ్‌మన్‌ క్యాప్‌కు అరుదైన గౌరవం

Sir Donald Bradman Test Cap Sells For $340000 At Auction - Sakshi

సిడ్నీ: ఆస్ట్రేలియా దివంగత దిగ్గజ క్రికెటర్‌ డాన్‌ బ్రాడ్‌మన్‌ తన అరంగేట్రం టెస్టులో ధరించిన బ్యాగీ గ్రీన్‌ టోపీకి 4 లక్షల 50 వేల ఆ్రస్టేలియన్‌  డాలర్ల (రూ. 2 కోట్ల 51 లక్షలు) ధర పలికింది. సిడ్నీలో నిర్వహించిన వేలంలో ఆస్ట్రేలియా వ్యాపారవేత్త పీటర్‌ ఫ్రీడ్‌మన్‌ ఈ మొత్తం వెచి్చంచి బ్రాడ్‌మన్‌ టోపీని సొంతం చేసుకున్నాడు. క్రికెటర్ల వస్తువులకు లభించిన రెండో అత్యధిక మొత్తమిది కావడం విశేషం. ఈ ఏడాది ఆరంభంలో ఆ్రస్టేలియా మేటి స్పిన్నర్‌ షేన్‌ వార్న్‌ టోపీ వేలంలో 10 లక్షల 7 వేల 500 ఆస్ట్రేలియన్‌ డాలర్లకు (రూ. 5 కోట్ల 61 లక్షలు) అమ్ముడుపోయింది. (చదవండి : ఒక్క ఓవర్‌.. ఐదు వికెట్లు.. సూపర్ కదా)

1928 నుంచి 1948 మధ్య కాలంలో 52 టెస్టులు ఆడిన బ్రాడ్‌మన్‌ 99.94 సగటుతో 6,996 పరుగులు చేశారు. వేలంలో అమ్ముడుపోయిన టోపీని బ్రాడ్‌మన్‌కు 1928 నవంబర్‌లో బ్రిస్బేన్‌లో ఇంగ్లండ్‌తో జరిగిన అరంగేట్రం టెస్టులో అందజేశారు. ఓవరాల్‌గా బ్రాడ్‌మన్‌ వద్ద 13 బ్యాగీ గ్రీన్‌ టోపీలు ఉన్నాయి. వేలంలోకి వచి్చన టోపీని బ్రాడ్‌మన్‌ 1928 అరంగేట్రం సిరీస్‌లోని నాలుగు టెస్టుల్లో ధరించారు. బ్రాడ్‌మన్‌ ఈ టోపీని 1959లో తన ఫ్యామిలీ ఫ్రెండ్‌ పీటర్‌ డన్‌హమ్‌కు బహుమతిగా ఇచ్చారు. అయితే ఇన్వెస్టర్లను మోసం చేసిన కేసులో ఈ ఏడాది పీటర్‌ డన్‌హమ్‌కు ఎనిమిదేళ్ల జైలుశిక్ష పడింది. దాంతో డన్‌హమ్‌ వద్ద ఉన్న బ్రాడ్‌మన్‌ టోపీని వేలం వేసి తద్వారా వచి్చన మొత్తంతో తమ బాకీలు తీర్చాలని డన్‌హమ్‌ బాధితులు కోరడంతో ఆ టోపీ వేలంలోకి వచ్చింది.(చదవండి : 'మీ చిన్నారులు తెగ ముద్దొచ్చేస్తున్నారు')

Read latest Sports News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top