Singapore Open 2022: ఫైనల్స్‌కు దూసుకెళ్లిన సింధు | Singapore Open: PV Sindhu Storms Into Finals After Beating Saena Kawakami In Semis | Sakshi
Sakshi News home page

Singapore Open 2022: ఫైనల్స్‌కు దూసుకెళ్లిన సింధు

Jul 16 2022 12:06 PM | Updated on Jul 16 2022 12:06 PM

Singapore Open: PV Sindhu Storms Into Finals After Beating Saena Kawakami In Semis - Sakshi

సింగపూర్‌ ఓపెన్‌ 2022 బ్యాడ్మింటన్‌ టోర్నీ మహిళల సింగిల్స్‌లో భారత స్టార్‌ షట్లర్‌ పీవీ సింధు దూసుకుపోతుంది. శనివారం (జులై 16) జరిగిన సెమీఫైనల్లో జపాన్‌ క్రీడాకారిణి, వరల్డ్‌ 38వ ర్యాంకర్‌ సయినా కవకామిపై 21-15, 21-7తేడాతో వరుస సెట్లలో విజయం సాధించి తుదిపోరుకు అర్హత సాధించింది. తొలి సెట్‌ నుంచే ప్రత్యర్ధిపై పూర్తి ఆధిపత్యం చలాయించిన సింధు.. కేవలం 32 నిమిషాల్లోనే గేమ్‌ను ముగించింది. ఈ ఏడాది రెండు సూపర్‌ 300 టైటిల్స్‌ (సయ్యద్‌ మోదీ, స్విస్‌ ఓపెన్‌) సాధించిన సింధు.. సింగపూర్‌ ఓపెన్‌ గెలిచి తొలి సూపర్‌ 500 టైటిల్‌ సాధించాలని ఉవ్విళ్లూరుతుంది.

డబుల్‌ ఒలింపిక్‌ మెడలిస్ట్‌ అయిన సింధు.. క్వార్టర్‌ ఫైనల్లో చైనా షట్లర్‌ హాన్‌ యుయేపై 17-21, 21-11, 21-19 తేడాతో విజయం సాధించిన విషయం తెలిసిందే. ఇదిలా ఉంటే, కెరీర్‌లో దాదాపు అన్ని సూపర్‌ 500 టైటిల్స్‌ సాధించిన సింధు సింగపూర్‌ ఓపెన్‌ మాత్రం గెలవలేకపోయింది. దీంతో సింధు ఈసారి ఎలాగైనా ఈ టైటిల్‌ గెలవాలని పట్టుదలగా ఉంది. ప్రస్తుత టోర్నీలో క్వార్టర్‌ ఫైనల్లో నిష్క్రమించిన సహచర షట్లర్‌ సైనా నెహ్వాల్‌ ప్రొఫెషనల్‌గా మారకముందే 2010లో సింగపూర్ ఓపెన్ టైటిల్ గెలిచింది.
చదవండి: Singapore Open 2022: సెమీస్‌కు దూసుకెళ్లిన సింధు.. సైనాకు తప్పని భంగపాటు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement