విజేత హలెప్‌ | Simona Halep Won The Title In Prague Open Tournament | Sakshi
Sakshi News home page

విజేత హలెప్‌

Aug 17 2020 1:22 AM | Updated on Aug 17 2020 1:22 AM

Simona Halep Won The Title In Prague Open Tournament - Sakshi

ప్రాగ్‌ (చెక్‌ రిపబ్లిక్‌): ఆరు నెలల విరామం తర్వాత బరిలోకి దిగిన తొలి టోర్నమెంట్‌లోనే రొమేనియా టెన్నిస్‌ స్టార్‌ సిమోనా హలెప్‌ టైటిల్‌ను సొంతం చేసుకుంది. ఆదివారం ముగిసిన ప్రాగ్‌ ఓపెన్‌ టోర్నీ ఫైనల్లో ప్రపంచ రెండో ర్యాంకర్‌ హలెప్‌ 6–2, 7–5తో మూడో సీడ్‌ ఎలీజ్‌ మెర్‌టెన్స్‌ (బెల్జియం)పై విజయం సాధించింది. ఈ ఏడాది హలెప్‌ ఖాతాలో చేరిన రెండో టైటిల్‌ ఇది. ఓవరాల్‌గా ఆమె కెరీర్‌లో ఇది 21వ సింగిల్స్‌ టైటిల్‌. 93 నిమిషాలపాటు జరిగిన ఫైనల్లో హలెప్‌ తన ప్రత్యర్థి సర్వీస్‌ను ఆరుసార్లు బ్రేక్‌ చేసింది. చాంపియన్‌ హలెప్‌నకు 25 వేల డాలర్ల ప్రైజ్‌మనీ (రూ. 18 లక్షల 71 వేలు)తోపాటు 280 ర్యాంకింగ్‌ పాయింట్లు లభించాయి.

Advertisement
 
Advertisement
Advertisement