
ఫ్లోరిడా వేదికగా వెస్టిండీస్‌తో జరిగిన నాలుగో టీ20లో 9 వికెట్ల తేడాతో టీమిండియా ఘన విజయం సాధించింది. దీంతో ఐదు మ్యాచ్‌ల సిరీస్‌ను టీమిండియా 2-2తో సమం చేసింది. తొలుత టాస్ గెలిచి బ్యాటింగ్ చేసిన విండీస్ 20 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 178 పరుగులు చేసింది. షిమ్రాన్ హెట్‌మైర్ (39 బంతుల్లో 61; 3 ఫోర్లు, 4 సిక్స్‌లు), షై హోప్ (29 బంతుల్లో 45; 3 ఫోర్లు, 2 సిక్స్‌లు) ధాటిగా ఆడారు. భారత బౌలర్లలో అర్ష్‌దీప్ సింగ్ మూడు వికెట్లు, కుల్దీప్ యాదవ్ రెండు, ముఖేష్ కుమార్, చాహల్ తలా వికెట్ సాధించారు.
ఓపెనర్ల విధ్వంసం..
179 పరుగుల భారీ భారీ లక్ష్యాన్ని టీమిండియా కేవలం 17 ఓవర్లలోనే ఊదిపడేసింది. లక్ష్య ఛేదనలో భారత యువ ఓపెనర్లు శుబ్‌మన్ గిల్, యశస్వీ జైశ్వాల్ అద్భుతమైన ఇన్నింగ్స్‌లు ఆడారు. విండీస్ బౌలర్లకు చుక్కలు చూపించారు. వీరిద్దరూ తొలి వికెట్‌కు 165 పరుగుల భాగస్వామ్యాన్ని నెలకొల్పారు. యశస్వి జైస్వాల్ (51 బంతుల్లో 84 నాటౌట్; 11 ఫోర్లు, 3 సిక్స్‌లు), శుబ్‌మన్ గిల్ (47 బంతుల్లో 77; 3 ఫోర్లు, 5 సిక్స్‌లు) అదరగొట్టారు.
రోహిత్-రాహుల్ రికార్డు సమం..
ఈ మ్యాచ్‌లో దుమ్మురేపిన జైశ్వాల్, గిల్ ఓ అరుదైన రికార్డును తన పేరిట లిఖించుకున్నాడు. టీ20ల్లో భారత తరపున రెండో అత్యధిక భాగస్వామ్యం నెలకొల్పిన జంటగా గిల్, జైశ్వాల్ నిలిచారు. ఈ క్రమంలో రోహిత్ శర్మ-రాహుల్ రికార్డును ఈ యువ జోడీ సమం చేసింది.
2017లో ఓ టీ20 మ్యాచ్‌లో శ్రీలంకపై రోహిత్-రాహుల్ కూడా 165 పరుగుల భాగస్వామే నెలకొల్పారు. ఇక అరుదైన ఘనత సాధించిన జాబితాలో దీపక్ హుడా-సంజూ శాంసన్ జోడి అగ్రస్ధానంలో ఉంది. 2022లో ఐర్లాండ్‌పై హడా, సంజూ ఏకంగా 176 పరుగుల భాగస్వామ్యాన్ని నమోదు చేశారు.
చదవండి: IND vs WI: చెలరేగిన ఓపెనర్లు.. నాలుగో టీ20లో భారత్ ఘన విజయం
"ʙᴀᴛᴛɪɴɢ, ᴛᴜ ʙᴀʜᴏᴛ ᴄʜᴀɴɢᴇ ʜᴏɢᴀʏɪ ʜᴀɪ."#WIvIND #INDvWIAdFreeonFanCode pic.twitter.com/FWm8rjacYN
— FanCode (@FanCode) August 12, 2023