Shikar Dhawan: 'ఓపెనర్‌గా నాకంటే శుబ్‌మన్‌ గిల్‌ బెటర్‌'

 Shikhar Dhawan's Stunning Response On Shubman Gill - Sakshi

టీమిండియా ఓపెనర్‌గా శిఖర్‌ ధావన్‌ ఒక దశాబ్దం పాటు వెలుగొందాడు. వయసు పెరగడంతో పాటు ఫామ్‌ కోల్పోవడంతో క్రమంగా జట్టుకు దూరమయ్యాడు. ఆటకు రిటైర్మెంట్‌ ప్రకటించనప్పటికి ఇప్పుడున్న పోటీలో ధావన్‌ మళ్లీ జట్టులో రావడం అసాధ్యమే. అయితే ధావన్‌ జట్టుకు దూరమైన తర్వాత ఓపెనింగ్‌ విషయంలో టీమిండియా సమస్యలు ఎదుర్కొంటుంది.

ఈ నేపథ్యంలో శిఖర్‌ ధావన్‌ ఒక మీడియాకు ఇచ్చిన ఇంటర్య్వూలో మాట్లాడుతూ శుబ్‌మన్‌ గిల్‌పై ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. ప్రస్తుతం టీమిండియాలో ఓపెనింగ్‌ కొరత కనిపిస్తుంది.. రోహిత్‌కు సరైన జోడి లేదు.. ఒకవేళ ఆ స్థానంలో శిఖర్‌ ధావన్‌, శుబ్‌మన్‌ గిల్‌లో ఒకరికి చోటు ఇవ్వాల్సి వస్తే ఎవరు బెస్ట్‌ అనుకుంటున్నారని ధావన్‌ను ప్రశ్నించారు.

ఈ ప్రశ్నపై స్పందించిన ధావన్‌.. త‌న పేరు చెప్పకుండా ఆ స్థానానికి శుభ్‌మ‌న్ గిల్‌ బెట‌ర్ అని చెప్పాడు. తాను సెలెక్ట‌ర్ ప్లేస్‌లో ఉంటే శుభ్‌మ‌న్‌గిల్‌ను ఓపెన‌ర్‌గా ఎంపిక చేస్తాన‌న్నాడు. టెస్ట్‌ల‌తో పాటు టి20ల్లో గిల్‌ చ‌క్క‌గా రాణిస్తున్నాడ‌ని పేర్కొన్నాడు. కానీ అత‌డికి స‌రైన అవ‌కాశాలు రావ‌డం లేద‌ని తెలిపాడు. అంతర్జాతీయ మ్యాచ్‌ల్లో త‌గిన‌న్ని అవ‌కాశాలు ల‌భిస్తే ఆట‌గాడిగా శుభ్‌మ‌న్‌ మ‌రింత రాటుదేలుతాడ‌ని శిఖ‌ర్ ధావ‌న్ అన్నాడు. ఓపెన‌ర్‌గా త‌న‌కంటే శుభ్‌మ‌న్ బెస్ట్‌గా భావిస్తోన్న‌ట్లు పేర్కొన్నాడు. జ‌ట్టుకు దూర‌మ‌య్యాన‌నే బాధ త‌న‌లో లేద‌ని పేర్కొన్నాడు.

కాగా గిల్‌పై ధావన్‌ చేసిన వ్యాఖ్యలు సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారాయి. 2010లో అంతర్జాతీయ క్రికెట్‌లో అరంగేట్రం చేసిన ధావన్‌ టీమిండియా తరపున 34 టెస్టులు, 167 వన్డేలు, 68 టి20 మ్యాచ్‌లు ఆడాడు.

చదవండి: ఒళ్లు గగుర్పొడిచే దృశ్యం.. భూమ్మీద నూకలు మిగిలే ఉన్నాయి

ఆర్సీబీ గుండె బద్దలయ్యే వార్త.. గాయాల కారణంగా ఇద్దరు స్టార్లు ఔట్‌..!

మరిన్ని వార్తలు :

Read latest Sports News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top