Moto GP: ఒళ్లు గగుర్పొడిచే దృశ్యం.. భూమ్మీద నూకలు మిగిలే ఉన్నాయి

Biker In Horrific Crash Suffers Fractured Jaw-Broken-Back In Moto-GP  - Sakshi

మోటోజీపీ రైడర్‌.. 31 ఏళ్ల పోల్ ఎస్పార్గారో తీవ్రంగా గాయపడ్డాడు. పోర్చుగీసు గ్రాండ్‌ప్రిక్స్‌లో భాగంగా శుక్రవారం జరిగిన ప్రాక్టీస్‌ రేసులో ఎస్పార్గారో బైక్‌ పట్టు తప్పడంతో ఘోర ప్రమాదానికి గురయ్యాడు. కెటీఎమ్‌ బైక్‌తో రేసులో పాల్గొన్న ఎస్పార్గారో ల్యాప్‌-1 పూర్తి చేసి రెండో ల్యాప్‌ను మరికొన్ని సెకన్లలో పూర్తి చేస్తాడనగా టర్న్‌-10 వద్ద బైక్‌ పట్టు తప్పింది.

అంతే బండితో పాటు రోడ్డుపై పడిపోయిన ఎస్పార్గారో దాదాపు 60 మీటర్ల దూరం దొర్లుకుంటూ వెళ్లాడు . దీంతో వెంటనే రెడ్‌ ఫ్లాగ్‌ చూపించి రేసును నిలిపివేశారు. 30 నిమిషాల పాటు అతనికి ప్రాథమిక చికిత్స నిర్వహించి అంబులెన్స్‌లో ఆసుపత్రికి తరలించారు.  అతని చాతి బాగానికి, పల్మనరీ కంట్యూషన్, దవడ బాగంలో బలంగా దెబ్బలు తగిలినట్లు గుర్తించామని వైద్యులు పేర్కొన్నారు.


మరిన్ని వార్తలు :

Read latest Sports News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top