షకీబ్‌ ఆల్‌రౌండ్‌ ప్రదర్శన | Shakib Al Hasan leads Bangladesh to series win against Zimbabwe | Sakshi
Sakshi News home page

షకీబ్‌ ఆల్‌రౌండ్‌ ప్రదర్శన

Jul 19 2021 2:44 AM | Updated on Jul 19 2021 2:44 AM

Shakib Al Hasan leads Bangladesh to series win against Zimbabwe - Sakshi

హరారే: జింబాబ్వేతో జరుగుతున్న మూడు వన్డేల సిరీస్‌ను మరో మ్యాచ్‌ మిగిలి ఉండగానే బంగ్లాదేశ్‌ జట్టు 2–0తో సొంతం చేసుకుంది. ఆదివారం జరిగిన రెండో వన్డేలో బంగ్లాదేశ్‌ మూడు వికెట్ల తేడాతో నెగ్గింది. స్టార్‌ ప్లేయర్‌ షకీబ్‌ అల్‌ హసన్‌ ఆల్‌రౌండ్‌ ప్రదర్శనతో బంగ్లాదేశ్‌ విజయంలో కీలకపాత్ర పోషించాడు. తొలుత జింబాబ్వే 50 ఓవర్లలో 9 వికెట్లకు 240 పరుగులు చేసింది. వెస్టీ మాడివెర్‌ (56; 5 ఫోర్లు, సిక్స్‌) అర్ధ సెంచరీ చేశాడు. షోరిఫుల్‌ ఇస్లాం (4/46), షకీబ్‌ (2/42) జింబాబ్వేను దెబ్బతీశారు. అనంతరం బంగ్లాదేశ్‌ 49.1 ఓవర్లలో ఏడు వికెట్లు కోల్పోయి 242 పరుగులు చేసి గెలిచింది. ‘మ్యాన్‌ ఆఫ్‌ ద మ్యాచ్‌’ షకీబ్‌ (109 బంతుల్లో 96 నాటౌట్‌; 8 ఫోర్లు) చివరివరకు క్రీజులో నిలిచాడు. ఎనిమిదో వికెట్‌కు సైఫుద్దీన్‌ (28 నాటౌట్‌)తో కలిసి అభేద్యంగా 69 పరుగులు జోడించాడు. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement