అఫ్రిది గోల్డెన్‌ డక్‌ చేశాడంటే పాక్‌దే విజయం!

Shaheen Afridi Sends Travis Head Golden Duck First Ball 3rd ODI Viral - Sakshi

ఆస్ట్రేలియాతో జరుగుతున్న మూడో వన్డేలో పాకిస్తాన్‌ పూర్తి ఆధిపత్యం ప్రదర్శిస్తోంది. రెండో వన్డేలో భారీ లక్ష్యాన్ని అవలీలగా చేధించిన పాక్ ఈ మ్యాచ్‌లో ఫుల్‌ జోష్‌లో కనిపిస్తుంది. 67 పరుగులకే 5 కీలక వికెట్లు కోల్పోయిన ఆస్ట్రేలియా పాక్‌ బౌలర్లతో పోరాడుతుంది. ఈ నేపథ్యంలో పాకిస్తాన్‌ స్టార్‌ బౌలర్‌ షాహిన్‌ అఫ్రిది మరోసారి తొలి బంతికే వికెట్‌తో మెరిశాడు.

రెండో వన్డేలో ఆసీస్‌ కెప్టెన్‌ ఆరోన్‌ ఫించ్‌ను గోల్డెన్‌ డక్‌ చేసిన అఫ్రిది.. ఈసారి ట్రెవిస్‌ హెడ్‌ను గోల్డెన్‌ డక్‌ చేశాడు. టాస్‌ ఓడి బ్యాటింగ్‌కు దిగిన ఆస్ట్రేలియాకు తొలి ఓవర్‌ తొలి బంతికే షాహిన్‌ అఫ్రిది షాక్‌ ఇచ్చాడు. అఫ్రిది బౌలింగ్‌లో తొలి బంతికే ట్రెవిస్‌ హెడ్‌ క్లీన్‌బౌల్డ్‌ అయ్యాడు. దీంతో సున్నా పరుగుకే తొలి వికెట్‌ కోల్పోయింది. ఆ తర్వాత హారిస్‌ రౌఫ్‌ వేసిన రెండో ఓవర్‌ మూడో బంతికి ఫించ్‌ కూడా డకౌట్‌ కావడంతో ఆసీస్‌ ఖాతా తెరవకుండానే రెండో వికెట్‌ కోల్పోయింది. అయితే అఫ్రిది గోల్డెన్‌ డక్‌ చేశాడంటే.. పాకిస్తాన్‌ వన్డే మ్యాచ్‌ గెలుస్తుందని పలువురు అభిమానులు జోస్యం చెబుతున్నారు. 

చదవండి: AUS vs PAK: పాపం గెలవాలన్న కసి అనుకుంటా.. అందుకే గోల్డెన్‌ డక్‌

Read latest Sports News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram 

Read also in:
Back to Top