Serena Williams Retirement: త్వరలోనే స్టార్‌ ప్లేయర్‌ రిటైర్మెంట్‌

Serena Williams To Retire From Tennis After US Open 2022 - Sakshi

న్యూయార్క్‌: తన విజయవంతమైన టెన్నిస్‌ కెరీర్‌కు త్వరలోనే వీడ్కోలు పలుకుతానని అమెరికా టెన్నిస్‌ దిగ్గజం, 23 గ్రాండ్‌స్లామ్‌ సింగిల్స్‌ టైటిళ్ల విజేత సెరెనా విలియమ్స్‌ తెలిపింది. రెండో సంతానం, బిజినెస్‌ కార్యకలాపాలవైపు దృష్టిసారిస్తాను అని వివరించింది. ‘వచ్చే నెలలో నేను 41వ వసంతంలోకి అడుగుపెడతాను. దీంతో నా జీవితంలో టెన్నిస్‌ ఆట చాలనుకుంటున్నా. దీన్ని నేను రిటైర్మెంట్‌గా సంబోధించను.

టెన్నిస్‌కు దూరంగా వెళుతున్నా. జీవితంలోని ఇతర ప్రాధాన్యతలవైపు పూర్తిగా మళ్లుతున్నా’ అని సెరెనా తెలిపింది. ప్రస్తుతం ఆమె టోరంటో ఓపెన్‌ బరిలోకి దిగింది. ఏడాది తర్వాత తొలి విజయం సాధించింది. తొలి రౌండ్‌లో సెరెనా 6–3, 6–4తో నూరియా (స్పెయిన్‌)పై గెలిచింది. గత ఏడాది ఫ్రెంచ్‌ ఓపెన్‌లో సెరెనా చివరిసారి నెగ్గింది. సెరెనా మరో గ్రాండ్‌స్లామ్‌ టైటిల్‌ సాధిస్తే ఆల్‌టైమ్‌ అత్యధిక గ్రాండ్‌స్లామ్‌ టైటి ల్స్‌ సాధించిన ప్లేయర్‌గా మార్గరెట్‌ కోర్ట్‌ (24 టైటిల్స్‌) పేరిట ఉన్న రికార్డును సమం చేస్తుంది.    

Read latest Sports News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top