
Courtesy: IPL Twitter
ఐపీఎల్ 2022లో ఇప్పటి వరకు ఆర్సీబీ స్టార్ ఆటగాడు విరాట్ కోహ్లి భారీ ఇన్నింగ్స్ ఆడకపోయినప్పటకీ.. జట్టు విజయంలో తన వంతు పాత్ర మాత్రం పోషిస్తున్నాడు. ఇప్పటి వరకు ఈ సీజన్‌లో నాలుగు మ్యాచ్‌లు ఆడిన కోహ్లి 106 పరుగులు సాధించాడు. కాగా ఏప్రిల్ 9 న ముంబై ఇండియన్స్‌తో జరిగిన మ్యాచ్‌లో కోహ్లి 48 పరుగులు సాధించి ఆర్సీబీ విజయంలో కీలక పాత్ర పోషించాడు. మరోవైపు ఐపీఎల్‌లో విరాట్ కోహ్లి ప్రదర్శనపై టీమిండియా మాజీ క్రికెటర్ సంజయ్ మంజ్రేకర్ ఆసక్తికర వాఖ్యలు చేశాడు. కోహ్లి ఇంకా పూర్తి స్థాయిలో ఫామ్‌లోకి రాలేదని మంజ్రేకర్ అభిప్రాయపడ్డాడు. అదే విధంగా కోహ్లి బ్యాటింగ్‌లో కాస్త దూకుడు తగ్గిందని మంజ్రేకర్ తెలిపాడు.
"ఈ సీజన్‌లో కోహ్లి పరుగులు సాధిస్తున్నాడు. దాంట్లో ఎటువంటి సందేహం లేదు. కానీ కోహ్లి నుంచి ఎప్పడూ ఇటువంటి ఇన్నింగ్స్ నేను ఊహించను. అతడు గతంలో సిక్సర్ బాదితే బంతి స్టాండ్స్‌లో పడేది. ఇప్పుడు మాత్రం అతడు కేవలం బౌండరీ రోప్‌ను మాత్రమే క్లియర్ చేస్తున్నాడు. అతడు బ్యాటింగ్‌లో పవర్ గేమ్ కాస్త తగ్గింది. ఐదు-ఆరేళ్ల క్రితం అతడు భారీ సిక్సర్లు కొట్టేవాడు. నేను కేవలం అతడు హిట్టింగ్‌పైన మాత్రమే దృష్టి సారిస్తాను. అంతే తప్ప అతడు 50 లేదా 60 పరుగలు సాధించాడన్నది నాకు ముఖ్యం కాదు" అని సంజయ్ మంజ్రేకర్ పేర్కొన్నాడు.
చదవండి: IPL 2022: కేకేఆర్‌తో మ్యాచ్.. సన్‌రైజర్స్ హైదరాబాద్‌కు గుడ్ న్యూస్!