Wasim Akram Vs Saleem Malik: 'పబ్లిసిటీ కోసమే ఇదంతా.. మాట్లాడడం వ్యర్థం'

Saleem Malik Responds Wasim Akram Comments Says He-Wants Publicity - Sakshi

పాకిస్తాన్‌ క్రికెట్‌ దిగ్గజం వసీం అక్రమ్‌.. తన ఆటోబయోగ్రఫీ ''సుల్తాన్‌: ఏ మొమొయిర్‌'' ద్వారా వరుసగా సంచలన విషయాలు బయటపెడుతున్న సంగతి తెలిసిందే. ''విదేశీ టూర్లకు వెళ్లినప్పుడు పాక్‌ మాజీ కెప్టెన్‌ సలీమ్‌ మాలిక్‌ తనను ఒక పనివాడిలా చూసేవాడని.. బట్టలు ఉతికేంచేవాడని.. అవసరమైనప్పుడల్లా మసాజ్‌ చేయించుకునేవాడు.. అంతేకాదు అతనొక స్వార్థపరుడు.. నాకు బౌలింగ్‌ ఇవ్వడానికి ఆలోచించేవాడు'' అంటూ అక్రమ్‌ తన బయోగ్రఫీలో పేర్కొనడం ఆసక్తిని రేపింది.

అయితే తాజాగా అక్రమ్‌ వ్యాఖ్యలపై సలీమ్‌ మాలిక్‌ ఎదురుదాడి చేశాడు. ''వాస్తవానికి అక్రమ్‌ చేసిన వ్యాఖ్యల్లో నిజం లేదు. మేం అప్పట్లో ఏ టూర్‌కు వెళ్లినా అక్కడ లాండ్రీ మెషిన్‌లు ఉంటాయి. మా బట్టలు అందులో వేసేవాళ్లం తప్ప ఎవరు ఉతుక్కునేవాళ్లం కాదు. ఇక నేను స్వార్థపరుడిని అంటున్నాడు. నిజానికి నేను కాదు అక్రమ్‌ స్వార్థపరుడు. తన గురించి గొప్పగా చెప్పుకోవడం కోసం ఎన్ని అబద్దాలు అయినా చెప్తాడు.

తాజాగా తన బయోగ్రఫీలోనూ అదే పేర్కొన్నాడు. కేవలం పబ్లిసిటీ కోసమే ఇదంతా చేస్తున్నాడు. తనను తాను అవమానించుకుంటున్నట్లు అతనికి అర్థమవడం లేదు. అయినా అక్రమ్‌ వ్యాఖ్యలపై ఎక్కువగా మాట్లాడాల్సిన అవసరం నాకు లేదు. బట్టలు ఉతికించడం.. మసాజ్‌ చేయించడం లాంటి పదాలు వాడాడు కాబట్టే.. అవన్నీ అబద్దాలు అని మాత్రమే చెప్పగలను. ఇంతకుమించి నేను ఏం మాట్లాడదలచుకోలేదు.'' అంటూ చెప్పుకొచ్చాడు.

ఇక  సలీమ్‌ మాలిక్‌ పాకిస్తాన్‌ క్రికెట్‌లో ఎంట్రీ  ఇచ్చిన  రెండేళ్ల తర్వాత 1984లో వసీమ్‌ అంతర్జాతీయ అరంగేట్రం చేశాడు. కాగా మాలిక్‌ సారథ్యంలో 1992-1995 కాలంలో అక్రమ్‌ 12 టెస్టులు, 34 వన్డేలు ఆడాడు. ఆ తర్వాత మాలిక్ మ్యాచ్ ఫిక్సింగ్‌కు పాల్పడినట్లు నేరం రుజువు కావడంతో అతనిపై జీవితకాలం నిషేధం పడింది. 

చదవండి: అతడు మసాజ్‌ చేయమనేవాడు.. చాలా కోపం వచ్చేది: వసీం అక్రమ్‌

బుడ్డోడి మోచేతి ధర రూ. 40 లక్షలంట!

Read latest Sports News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top