SPL: ఉత్సాహం .. ఉద్వేగం.. రసవత్తరంగా సాగుతున్న ఎస్‌పీఎల్‌ క్రికెట్‌ టోర్నీ

Sakshi Premier League Khammam: Sri Chaitanya Jr College Reach Semis 1

సెమీస్‌కు చేరిన శ్రీ చైతన్య జూనియర్‌ కళాశాల

క్వార్టర్స్‌కు ప్రవేశించిన ఎస్‌బీఐటీ, అనూబోస్‌ డిప్లొమా జట్లు

ఖమ్మం స్పోర్ట్స్‌నగరంలోని ఎస్‌ఆర్‌అండ్‌బీజీఎన్‌ఆర్‌ కళాశాల మైదానంలో జరుగుతున్న సాక్షి ప్రీమియర్‌ లీగ్‌ క్రికెట్‌ పోటీలు ఉత్సాహంగా.. ఉద్వేగంగా సాగుతున్నాయి. ఆదివారం రెండోరోజు క్వార్టర్‌ ఫైనల్‌ మ్యాచ్‌లో శ్రీచైతన్య జూనియర్‌ కళాశాల – వెలాసిటీ జూనియర్‌ కళాశాల జట్లు తలపడ్డాయి. ముందుగా బ్యాటింగ్‌ చేసిన శ్రీచైతన్య జూనియర్‌ కళాశాల జట్టు 74 పరుగులు చేయగా, తర్వాత బ్యాటింగ్‌ చేసిన వెలాసిటీ జూనియర్‌ కళాశాల జట్టు 52 పరుగులు మాత్రమే చేసి ఓడిపోయింది. దీంతో శ్రీచైతన్య జూనియర్‌ కళాశాల జట్టు 22 పరుగుల తేడాతో విజయం సాధించింది.

కాగా ఇప్పటికే రెండు మ్యాచ్‌లు గెలిచిన ఎస్‌బీఐటీ డిప్లొమా కాలేజీ జట్టు తన ప్రత్యర్థి ఏఎస్‌ఆర్‌ జూనియర్‌ కళాశాలపై నెగ్గి క్వార్టర్‌ ఫైనల్స్‌కు ప్రవేశించింది. ముందుగా టాస్‌ గెలిచి బ్యాటింగ్‌ చేపట్టిన ఏఎస్‌ఆర్‌ జట్టు పరిమిత ఓవర్లకు 63 పరుగులు సాధించగా బ్యాట్స్‌మెన్‌ ముస్తఫా 19 పరుగులు చేశాడు. అనంతరం బ్యాటింగ్‌ చేసిన ఎస్‌బీఐటీ జట్టు సునాయాసంగా లక్ష్యం సాధించింది.

దీంతో ఎస్‌బీఐటీ డిప్లొమా కాలేజీ జట్టు క్వార్టర్‌ ఫైనల్స్‌కు చేరింది. కిట్స్‌ డిప్లొ మా కాలేజీ ఖమ్మం – అనుబోస్‌ డిప్లొమా కళాశాల పాల్వంచ జట్ల మ్యాచ్‌లో.. ముందుగా టాస్‌ గెలిచిన అనుబోస్‌ డిప్లొమా జట్టు ఫీల్డింగ్‌ను ఎంచుకుంది. దీంతో మొదట బ్యాటింగ్‌ చేసిన కిట్స్‌ జట్టు 78 పరుగులు సాధించింది. అనంతరం బ్యాటింగ్‌ చేసిన అనుబోస్‌ జట్టు 40 పరుగులు మాత్రమే చేసి ఓటమి పాలైంది. దీంతో కిట్స్‌ డిప్లొ మా కళాశాల జట్టు క్వార్టర్‌ ఫైనల్స్‌కు చేరుకుంది.

మొదటి రౌండ్‌లో బొమ్మ కాలేజీ విజయభేరి.. బొమ్మ డిప్లొమా కాలేజీ – వాణి ఐటీఐ ఖమ్మం జట్ల మధ్య జరిగిన మ్యాచ్‌లో ముందుగా టాస్‌ గెలిచి బ్యాటింగ్‌ ఎంచుకున్న వాణి ఐటీఐ జట్టు పరిమిత ఓవర్లలో 71 పరుగులు చేయగా, తర్వాత బ్యాటింగ్‌ చేసిన బొమ్మ డిప్లొమా కాలేజీ జట్టు 72 పరుగులు సాధించింది. రెండో మ్యాచ్‌లో ఆర్‌జేసీ జూనియర్‌ కళాశాల – ప్రభుత్వ పాలిటెక్నిక్‌ కళాశాల కొత్తగూడెం జట్ల మధ్య జరిగిన మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్‌ ఎంచుకున్న ఆర్‌జేసీ జట్టు కేవలం 44 పరుగులు చేయగా.. తర్వాత బ్యాటింగ్‌ చేసిన ప్రభుత్వ పాలిటెక్నిక్‌ కళాశాల కొత్తగూడెం జట్టు ఘన విజయం సాధించింది.

మరో మ్యాచ్‌లో కృష్ణవేణి జూనియర్‌ కళాశాల 2– వెలాసిటీ జూనియర్‌ కళాశాల ఖమ్మం జట్ల మధ్య జరిగిన మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్‌ చేసిన కృష్ణవేణి జట్టు 53 పరుగులు చేయగా అనంతరం బ్యాటింగ్‌ చేసిన వెలాసిటీ జూనియర్‌ కళాశాల జట్టు నాలుగు వికెట్ల నష్టంతోనే లక్ష్యం సాధించింది.

మూడో మ్యాచ్‌లో రెజొనెన్స్‌ జూనియర్‌ కళాశాల (మెయిన్‌ క్యాంపస్‌) – ముదిగొండ జూనియర్‌ కళాశాల జట్ల మధ్య జరిగిన మ్యాచ్‌లో ముందుగా టాస్‌ గెలిచి బ్యాటింగ్‌ ఎంచుకున్న రెజొనెన్స్‌ జూనియర్‌ కళాశాల (మెయిన్‌ క్యాంపస్‌) నిర్ణీత ఒవర్లలో 7 వికెట్లు కోల్పోయి 64 పరుగులు సాధించింది. అనంతరం బ్యాటింగ్‌ చేసిన ముదిగొండ జూనియర్‌ కళాశాల జట్టు పరిమిత ఓవర్లకు 5 వికెట్ల నష్టానికి 55 పరుగులు చేసి ఓటమి పాలైంది. దీంతో రెజొనెన్స్‌ జూనియర్‌ కళాశాల జట్టు ఘన విజయం సాధించింది. జట్టు కెప్టెన్‌ రేవంత్‌ చక్కని ప్రతిభ కనబరిచిచాడు.
చదవండి: IND vs NZ: కుల్దీప్‌ మ్యాజిక్‌ డెలివరి.. దెబ్బకు కివీస్‌ బ్యాటర్‌ ఫ్యూజ్‌లు ఔట్‌! వీడియో వైరల్‌

Read latest Sports News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top