IND vs NZ: కుల్దీప్ మ్యాజిక్ డెలివరి.. దెబ్బకు కివీస్ బ్యాటర్ ఫ్యూజ్‌లు ఔట్! వీడియో వైరల్

లక్నో వేదికగా న్యూజిలాండ్‌తో జరిగిన రెండో టీ20లో 6 వికెట్ల తేడాతో టీమిండియా విజయం సాధించింది. దీంతో మూడు టీ20ల సిరీస్ 1-1 సమమైంది. ఇక ఇది ఇలా ఉండగా.. ఈ మ్యాచ్‌లో భారత స్పిన్నర్ కుల్దీప్ యాదవ్ సంచలన బంతితో మెరిశాడు. న్యూజిలాండ్ బ్యాటర్ డారిల్ మిచెల్‌ను కుల్దీప్ ఔట్ చేసిన విధానం మ్యాచ్ మొత్తానికే హైలెట్‌గా నిలిచింది. మిచిల్‌ను ఓ అద్భుతమైన బంతితో కుల్దీప్ క్లీన్ బౌల్డ్ చేశాడు.
ఏం జరిగిందంటే?
టాస్ గెలిచి బ్యాటింగ్ దిగిన కివీస్ ఆది నుంచే భారత స్పిన్నర్లు ఎదుర్కొవడానికి ఇబ్బంది పడింది. తొలి నాలుగు వికెట్లు కూడా స్పిన్నర్లకే దక్కాయి. వరుస క్రమంలో వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడ్డ న్యూజిలాండ్‌ను మిచెల్.. మరో బ్యాటర్ చాప్‌మాన్‌తో కలిసి అదుకునే ప్రయత్నం చేశాడు. ఇదే సమయంలో కుల్దీప్ యాదవ్.. మిచెల్‌ను ఔట్ చేసి కివీస్‌ను కోలుకోలేని దెబ్బ కొట్టాడు.
న్యూజిలాండ్ ఇన్నింగ్స్ 10 ఓవర్‌లో కుల్దీప్ యాదవ్ వేసిన ఓ మిస్టరీ బంతికి మిచెల్ దగ్గర సమాధానం లేకుండాపోయింది. ఆఫ్ స్టంప్ వెలుపల బంతి ఒక్క సారిగా టర్న్ అయ్యి స్టంప్స్‌ను గిరాటేసింది. ఇది చూసిన మిచెల్ ఒక్క సారిగా షాక్‌కు గురయ్యాడు. కుల్దీప్ దెబ్బకు కేవలం 8 పరుగులు మాత్రమే చేసిన మిచెల్ నిరాశతో పెవిలియన్‌కు చేరాడు. ఇందుకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.
చదవండి: T20 WC: 2005 వరల్డ్‌కప్ టైమ్‌లో పుట్టినోళ్లు! ఒక్కొక్కరిది ఒక్కో కథ.. కుల్దీప్ కోచ్ దత్తత తీసుకున్న ఆ అమ్మాయి..
How about that for a ball! 👍 👍@imkuldeep18 bowled an absolute beaut to dismiss Daryl Mitchell 👏 👏 #TeamIndia | #INDvNZ | @mastercardindia
Watch 🎥 🔽 pic.twitter.com/EpgXWYC2XE
— BCCI (@BCCI) January 29, 2023
మరిన్ని వార్తలు :