భారత డేవిస్‌కప్‌ టెన్నిస్‌ జట్టులో సాకేత్‌  | Saketh Myneni In The Indian Davis Cup Tennis Team | Sakshi
Sakshi News home page

భారత డేవిస్‌కప్‌ టెన్నిస్‌ జట్టులో సాకేత్‌ 

Sep 12 2022 3:39 AM | Updated on Sep 12 2022 3:39 AM

Saketh Myneni In The Indian Davis Cup Tennis Team - Sakshi

సాక్షి, హైదరాబాద్‌: నార్వే వేదికగా నార్వే జట్టుతో ఈనెల 16, 17వ తేదీల్లో జరిగే డేవిస్‌కప్‌ టెన్నిస్‌ వరల్డ్‌ గ్రూప్‌–1 మ్యాచ్‌లో పాల్గొనే భారత జట్టులో ఒక మార్పు జరిగింది. గాయంతో వైదొలిగిన డబుల్స్‌ స్టార్‌ రోహన్‌ బోపన్న స్థానంలో  ఆంధ్రప్రదేశ్‌ ప్లేయర్‌ సాకేత్‌ మైనేనిని ఎంపిక చేశారు.

ఈ ఏడాది యూకీ బాంబ్రీతో కలిసి సాకేత్‌ ఐదు ఏటీపీ చాలెంజర్‌ డబుల్స్‌ టైటిల్స్‌ గెలిచాడు. ప్రస్తుతం సాకేత్‌ డబుల్స్‌ ర్యాంకింగ్స్‌లో 96వ ర్యాంక్‌లో ఉన్నాడు.    2014లో తొలిసారి భారత డేవిస్‌కప్‌ జట్టులోకి ఎంపికైన సాకేత్‌ డేవిస్‌కప్‌లో నాలుగు మ్యాచ్‌ల్లో గెలిచి, నాలుగు మ్యాచ్‌ల్లో ఓడిపోయాడు.   

Advertisement
 
Advertisement
Advertisement