IPL 2022 RCB Vs GT: గుజరాత్‌ బ్యాటర్‌పై ఆసక్తికర వ్యాఖ్యలు చేసిన సచిన్‌

Saha Is A Dangerous Player, I Rate Him Highly Says Sachin Tendulkar - Sakshi

గుజరాత్‌ ఓపెనింగ్‌ బ్యాటర్‌, వెటరన్‌ వికెట్‌కీపర్‌ వృద్ధిమాన్‌ సాహాపై క్రికెట్‌ దిగ్గజం సచిన్‌ టెండూల్కర్‌ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. ఐపీఎల్‌లో సాహా మోస్ట్‌ అండర్‌ రేటెడ్‌ ప్లేయర్‌ అని పేర్కొన్నాడు. సాహాలో టాలెంట్‌ ఉన్నా అదృష్టం కలిసిరావట్లేదని అభిప్రాయపడ్డాడు. లేటు వయసులో సాహా అదిరిపోయే ప్రదర్శనలతో రెచ్చిపోతున్నాడని కితాబునిచ్చాడు. ప్రస్తుత ఐపీఎల్‌ సీజన్‌లో ఏ మాత్రం అంచనాలు లేకుండా బరిలోకి దిగిన సాహా.. మోస్ట్‌ డేంజరెస్‌ ప్లేయర్‌గా మారాడని, అతను మైదానం నలుదిక్కులా షాట్లు ఆడగలుగుతున్నాడని, సాహాకు తాను హై రేటింగ్‌ ఇస్తానని ప్రశంసలు కురిపించాడు. సాహా.. ఎలాంటి బౌలింగ్‌నైనా సమర్థవంతంగా ఎదుర్కొని పరుగులు రాబట్టగల ప్రతిభావంతుడైన ఆటగాడని కొనియాడాడు. 

అతను క్రీజులో నిలదొక్కుకుంటే అత్యంత ప్రమాదకర ఆటగాడని ఆకాశానికెత్తాడు. సాహా ప్రస్తుత ఫామ్‌ను పరిగణలోకి తీసుకొని, అతనికి టీమిండియాలో అవకాశం కల్పించాలని సెలెక్టర్లకు పరోక్ష సూచన చేశాడు. ఈ మేరకు సచిన్‌ తన లేటెస్ట్‌ యూట్యూబ్ వీడియోలో సాహాపై తన పాజిటివిటీని వ్యక్తపరిచాడు. 

ఐపీఎల్ 2022 సీజన్‌లో 9 మ్యాచ్‌లు ఆడిన సాహా.. 39 సగటున 312 పరుగులు చేశాడు. ఇందులో 3 అర్ధసెంచరీలు ఉన్నాయి. స్పోర్ట్స్‌ జర్నలిస్ట్‌తో వివాదంలో ఇటీవలే క్లీన్‌ చిట్‌ పొందిన సాహా.. తాజాగా మరో వివాదానికి తెరలేపాడు. బెంగాల్‌ రంజీ జట్టులో అవకాశం ఇస్తామన్నా.. తనను జట్టు నుంచి రిలీవ్‌ చేయాలని రాద్ధాంతం చేస్తున్నాడు. టీమిండియా తరఫున 40 టెస్ట్‌లు, 9 వన్డేలు ఆడిన సాహా 3 సెంచరీలు, అర్ధసెంచరీల సాయంతో 1394 పరుగులు చేశాడు. టెస్ట్‌ ప్లేయర్‌గా ముద్రపడిన ఈ బెంగాలీ వెటరన్‌.. ఆ ముద్రను చెరిపేసుకునేందుకు శతవిధాల ప్రయత్నిస్తున్నాడు. అందులో భాగంగానే అతను బ్యాట్‌ను ఝులిపించడం మొదలుపెట్టాడు. ఐపీఎల్‌లో 142 మ్యాచ్లు ఆడిన సాహా పేరిట ఐపీఎల్‌లో ఓ శతకం కూడా నమోదై ఉంది.
చదవండి: 'అర్థం పర్థం లేని ట్వీట్స్‌.. మాకేదో తేడా కొడుతుంది'

Read latest Sports News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram

మరిన్ని వార్తలు

21-05-2022
May 21, 2022, 12:32 IST
RR Vs CSK: హెట్‌మెయిర్‌ భార్యను ప్రస్తావిస్తూ గావస్కర్‌ కామెంట్‌.. ‘మీకసలు బుద్ధుందా’ అంటూ నెటిజన్ల ఫైర్‌
21-05-2022
May 21, 2022, 12:06 IST
రాజస్తాన్‌ రాయల్స్‌ స్టార్‌ స్పిన్నర్‌ యజ్వేంద్ర చహల్‌ ఐపీఎల్‌లో అరుదైన ఫీట్‌ సాధించాడు. ఇప్పటికే పర్పుల్‌ క్యాప్‌ రేసులో దూసుకుపోతున్న...
21-05-2022
May 21, 2022, 11:52 IST
సీఎస్‌కే వైఫల్యంపై ఆకాశ్‌ చోప్రా ఘాటు విమర్శలు.. చెత్త ప్రదర్శన అంటూ విసుర్లు
21-05-2022
May 21, 2022, 10:55 IST
ఈసారి ఎలాగైనా ఐపీఎల్‌ కప్‌ కొట్టాలనే లక్ష్యంతో బరిలోకి దిగిన రాజస్తాన్‌ రాయల్స్‌ లీగ్‌ దశను విజయవంతంగా ముగించింది. శుక్రవారం...
21-05-2022
May 21, 2022, 08:29 IST
ఐపీఎల్‌ 2022 సీజన్‌లో రాజస్తాన్‌ రాయల్స్‌ లీగ్‌ దశను రెండో స్థానంతో ముగించింది. శుక్రవారం సీఎస్‌కేతో జరిగిన మ్యాచ్‌లో రాజస్తాన్‌...
21-05-2022
May 21, 2022, 05:40 IST
ముంబై: రాజస్తాన్‌ రాయల్స్‌ లక్ష్యఛేదనకు దిగిన తొలి ఓవర్‌ పూర్తవడంతోనే నెట్‌ రన్‌రేట్‌తో ఈ ఐపీఎల్‌ సీజన్‌లో ‘ప్లే ఆఫ్స్‌’...
20-05-2022
May 20, 2022, 23:11 IST
సీఎస్‌కే పై 5 వికెట్ల తేడాతో రాజస్తాన్‌ విజయం సీఎస్‌కే పై 5 వికెట్ల తేడాతో రాజస్తాన్‌ విజయం సాధించింది. దీంతో పాయింట్ల పట్టికలో...
20-05-2022
May 20, 2022, 16:52 IST
ఢిల్లీపై ముంబై విజయం సాధించాలని కోరుకున్న గ్లెన్‌ మాక్స్‌వెల్‌
20-05-2022
May 20, 2022, 12:21 IST
IPL 2022 Playoffs Qualification Scenarios In Telugu: ఐపీఎల్‌-2022 సీజన్‌ ముగింపు దశకు చేరుకుంటోంది. ఐదుసార్లు చాంపియన్‌ అయిన...
20-05-2022
May 20, 2022, 11:42 IST
ఆర్‌సీబీ సీనియర్‌ ఆటగాడు విరాట్‌ కోహ్లి.. ఐపీఎల్‌ 2022 సీజన్‌లో రెండో అర్థసెంచరీ మార్క్‌ అందుకున్నాడు. గుజరాత్‌ టైటాన్స్‌తో మ్యాచ్‌లో...
20-05-2022
May 20, 2022, 10:56 IST
 సీఎస్‌కే తుదిజట్టులో అతడిని చూడాలని ఉంది.. ధోని ఒక్క ఛాన్స్‌ ఇస్తే: పార్థివ్‌ పటేల్‌
20-05-2022
May 20, 2022, 09:16 IST
గుజరాత్‌ టైటాన్స్‌ వికెట్‌ కీపర్‌ మాథ్యూ వేడ్‌ తాను ఔట్‌ కాదంటూ డ్రెస్సింగ్‌ రూమ్‌లో చేసిన రచ్చ సోషల్‌ మీడియాలో...
20-05-2022
May 20, 2022, 08:30 IST
ఐపీఎల్‌ 2022 సీజన్‌లో గురువారం ఆర్‌సీబీ గుజరాత్‌ టైటాన్స్‌పై కీలక విజయం సాధించింది. 169 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన...
20-05-2022
May 20, 2022, 07:45 IST
ముంబై: చాన్నాళ్ల తర్వాత విరాట్‌ కోహ్లి దంచేశాడు. మ్యాక్స్‌వెల్‌ ఆల్‌రౌండ్‌ మెరుపులు మెరిపించాడు. రాయల్‌ చాలెంజర్స్‌ బెంగళూరు (ఆర్సీబీ) తమ...
19-05-2022
May 19, 2022, 23:06 IST
ఆర్‌సీబీ సీనియర్‌ ఆటగాడు విరాట్‌ కోహ్లి ఐపీఎల్‌ చరిత్రలో అరుదైన ఫీట్‌ సాధించాడు. ఆర్‌సీబీ తరపున ఐపీఎల్‌లో ఏడువేల పరుగుల...
19-05-2022
May 19, 2022, 22:35 IST
ఆర్‌సీబీతో మ్యాచ్‌లో గుజరాత్‌ టైటాన్స్‌ ఇన్నింగ్స్‌ సమయంలో ఒక ఆసక్తికర ఘటన చోటుచేసుకుంది. గుజరాత్‌ టైటాన్స్‌ కెప్టెన్‌ హార్దిక్‌ పాండ్యా...
19-05-2022
May 19, 2022, 20:46 IST
ఐపీఎల్‌ 2022 సీజన్‌లో అంపైర్లు తీసుకున్న కొన్ని నిర్ణయాలు వివాదాస్పదంగా మారాయి. బ్యాట్స్‌మన్‌ రివ్యూలు తీసుకున్నప్పటికి డీఆర్‌ఎస్‌లు సరిగా పనిచేయక...
19-05-2022
19-05-2022
May 19, 2022, 16:47 IST
ఐపీఎల్‌ అంటేనే మజాకు పెట్టింది పేరు. బ్యాట్స్‌మెన్‌ సిక్సర్ల వర్షం.. బౌలర్ల వికెట్ల వేట.. వెరసి మ్యాచ్‌ చూడడానికి వచ్చే...
19-05-2022
May 19, 2022, 16:08 IST
IPL 2022- Final Match: ఐపీఎల్‌-2022 ముంగిపు దశకు చేరుకుంటోంది. ఇప్పటికే రెండు ప్లే ఆఫ్‌ బెర్తులు ఖరారు కాగా..... 

Read also in:
Back to Top