కోహ్లి... నీకో బహుమతి: సచిన్‌ 

Sachin Tendulkar gave a priceless gift to King Kohli - Sakshi

అహ్మదాబాద్‌: భారత క్రికెట్‌ దిగ్గజం సచిన్‌ టెండూల్కర్‌ వన్డేల్లో తన 49 సెంచరీల రికార్డును చెరిపేసిన కింగ్‌ కోహ్లికి అమూల్యమైన బహుమతిని బహూకరించాడు. 24 ఏళ్ల కెరీర్‌లో తన 10 నంబర్‌ జెర్సీ అంతర్జాతీయ క్రికెట్‌లో లిఖించిన చరిత్ర అందరికీ తెలిసిందే. ఫైనల్‌కు ముందు సచిన్‌ స్వయంగా చేసిన ఆటోగ్రాఫ్‌ జెర్సీని కోహ్లికి అందజేశాడు.

ఈ జెర్సీని సచిన్‌ 2012లో జరిగిన ఆసియా కప్‌లో పాకిస్తాన్‌తో జరిగిన ఆఖరి వన్డే సందర్భంగా ధరించాడు. ‘ఈ ప్రత్యేక సందర్భంలో ప్రత్యేక అనుభూతినిచ్చే గిఫ్ట్‌ను సచిన్‌... విరాట్‌కు అందజేశాడు’ అని బీసీసీఐ సచిన్, కోహ్లిల ఫోటోతో పోస్ట్‌ చేసింది. న్యూజిలాండ్‌తో జరిగిన సెమీస్‌ మ్యాచ్‌లో విరాట్‌ కోహ్లి 50వ సెంచరీతో సచిన్‌ రికార్డు (49)ను బద్దలు కొట్టాడు.   

Read latest Sports News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram 

Read also in:
Back to Top