సప్రైజ్ ఇవ్వనున్న రాజస్తాన్‌ రాయల్స్‌! | RT 3000 Rahul Tewatia and Jofra Archer to open batting against KKR? | Sakshi
Sakshi News home page

సప్రైజ్ ఇవ్వనున్న రాజస్తాన్‌ రాయల్స్‌!

Sep 30 2020 7:16 PM | Updated on Sep 30 2020 7:55 PM

RT 3000 Rahul Tewatia and Jofra Archer to open batting against KKR? - Sakshi

మొన్న జరిగిన ఐపీఎల్‌ మ్యాచ్‌లో కింగ్స్‌ ఎలెవన్‌ పంజాబ్‌ జట్టుపై అనూహ్య రీతిలో రాజస్తాన్‌ రాయల్స్‌ గెలిచిన సంగతి తెలిసిందే. రాజస్తాన్‌ రాయల్స్‌ జట్టు ఓడిపోతుంది అనుకున్న చివరి నిమిషంలో జోఫ్రా ఆర్చర్‌, రాహుల్‌ తివాటియా జట్టును అనూహ్యా రీతిలో గెలిపించారు. తివాటియా 31 బంతుల్లో 53 పరుగులు చేసి అందరిని ఆశ్చర్యపరచగా, తరువాత వచ్చిన ఆర్చర్‌ మూడు బంతుల్లో 2 సిక్స్‌లు కొట్టి 13 రన్స్‌ చేసి జట్టును గెలిపించారు. దీంతో వీరిద్దరిని కోల్‌కత్తా నైట్‌ రైడర్స్‌తో జరిగే తదుపరి మ్యాచ్‌లో ఓపెనర్స్‌గా దించాలని ఫ్యాన్స్‌ డిమాండ్‌ చేస్తున్నారు.

దీనిపై స్పందించిన రాజస్తాన్‌ రాయల్స్‌ జట్టు యాజమాన్యం ఒక కండీషన్‌ పెట్టింది. తివాటియాను, ఆర్చర్‌ను ఓపెనర్స్‌గా దించాలని కోరుకుంటే తాము చేసిన ట్వీట్‌కు 3000 రీ ట్వీట్స్‌ రావాలని అప్పుడే వారిని ఓపెనర్స్‌గా దించుతామని ప్రకటించింది. ‘ఆర్‌టీ 3000 టు మేక్‌ తివాటిరా, జోఫ్రా ఓపెన్‌ ది బ్యాటింగ్‌ టు నైట్‌’ అని  రాజస్థాన్‌ రాయల్స్‌ ట్వీట్‌ చేసింది.

ఇప్పటి వరకు 2020 ఐపీఎల్‌లో రాజస్థాన్‌ రాయల్స్‌ 2 మ్యాచ్‌లు గెలవగా, నేడు కోల్‌కతా నైట్‌ రైడర్స్‌తో జరిగే మ్యాచ్‌ను గెలవాలని కసిగా ఉంది. ఎప్పుడు మిడిల్‌ బ్యాట్స్‌మెన్‌గా బరిలో దిగే తివాటియా మొన్న పంజాబ్‌ జట్టుపై చివరిలో దిగి ఒక్క ఓవర్‌లోనే 5 సిక్స్‌లు కొట్టి జట్టును గెలిపించాడు. అతనితో పాటు ఆర్చర్‌కూడా ఆ ‍మ్యాచ్‌లో అదరగొట్టాడు. దీంతో వారిద్దరిని ఓపెనర్స్‌గా దించాలని ఫ్యాన్స్‌ కోరుతున్నారు.  

చదవండి: ఆఖరి ఓవర్లలో... ఆరేశారు 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement