Cristiano Ronaldo: మ్యాచ్ ఓడిపోయి బాధలో ఉంటే బికినీలో అందాల ప్రదర్శన?

సూపర్‌స్టార్ క్రిస్టియానో రొనాల్డో నేతృత్వంలోని పోర్చుగల్ జట్టు ఫిఫా వరల్డ్‌కప్‌లో రౌండ్ ఆఫ్ 16కు అర్హత సాధించిన సంగతి తెలిసిందే. అయితే గ్రూప్ దశలో పోర్చుగల్ తమ ఆఖరి మ్యాచ్ సౌత్ కొరియా చేతిలో ఓటమి పాలైంది. అయితే అప్పటికే రెండు విజయాలు సాధించిన పోర్చుగల్ తమతో పాటు దక్షిణ కొరియాను రౌండ్ ఆఫ్ 16కు తీసుకెళ్లింది.
అయితే రొనాల్డో లాంగ్‌టైమ్ గర్ల్‌ఫ్రెండ్ జార్జినా రోడ్రిగేజ్ ఖతర్‌లో సందడి చేసింది. వీరిద్దరు 2016 నుంచి రిలేషిన్‌షిప్‌లో ఉన్నారు. ఫిఫా వరల్డ్‌కప్‌లో పోర్చుగల్ ఆడిన తొలి రెండు మ్యాచ్‌లకు జార్జినా హాజరు కాలేదు. సౌత్ కొరియాతో మ్యాచ్‌కు మాత్రం హాజరైన జార్జినా.. తన లవర్ రొనాల్డోకు మద్దతినిస్తూ పోర్చుగల్ గెలవాలని కోరుకుంది. కానీ మ్యాచ్‌లో పోర్చుగల్ ఓటమి పాలయింది. అయితే మ్యాచ్ ముగిశాకా ఖతర్ బీచ్‌కు వచ్చిన జార్జినా రోడ్రిగేజ్ టూ పీస్ బికినీలో అందాల ప్రదర్శన చేసింది. దీనికి సంబంధించిన ఫోటోలను జార్జినా స్వయంగా ట్విటర్‌లో పంచుకుంది. ఇది చూసిన కొంతమంది రొనాల్డో వీరాభిమానులు.. మ్యాచ్ ఓడిపోయామని రొనాల్డో బాధపడుతుంటే.. బికినీలో అందాల ప్రదర్శన ఏంటి అంటూ కామెంట్ చేశారు.
అయితే పోర్చుగల్ రౌండ్ ఆఫ్ 16కు అర్హత సాధించడంతో జార్జినాపై విమర్శలు రాలేదు. లేదంటే ఆమె చర్యకు అభిమానులు తీవ్ర స్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేసేవారు. పోర్చుగల్‌ను విశ్వవిజేతగా నిలపాలని రొనాల్డో కష్టపడుతుంటే.. అతనికి మద్దతు ఇవ్వాల్సింది పోయి ఈమె మాత్రం ఖతర్ వీధుల్లో బికినీలు వేసుకొని ఎంజాయ్ చేయడమేంటని కొంతమంది పేర్కొన్నారు. ఇక పోర్చుగల్ డిసెంబర్ 7న జరగనున్న ప్రీక్వార్టర్స్‌లో స్విట్జర్లాండ్‌తో తలపడనుంది.
🌊💚 #georginarodriguez pic.twitter.com/Hc2EvRkbxL
— Georgina Rodríguez (@__georginagio) December 3, 2022
మరిన్ని వార్తలు :